మరింత చదవండి

అన్నీ చూడండి

Kuppam: కుప్పం విమానాశ్రయంపై తమిళనాడు అసెంబ్లీలో చర్చ.. సంగతేంటి?

Kuppam: కుప్పం విమానాశ్రయంపై తమిళనాడు అసెంబ్లీలో చర్చ.. సంగతేంటి?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయం తమిళనాడు అసెంబ్లీలో రాజకీయ చర్చకు దారితీసింది. హోసూర్ విమానాశ్రయ ప్రాజెక్టుపై డీఎంకే ఎమ్మెల్యే శ్రీనివాసన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతిపాదిత విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలను తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన తోసిపుచ్చారు. హోసూర్ విమానాశ్రయాన్ని ఆపడానికి ఏ రాష్ట్రం కూడా ప్రయత్నించడం లేదని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై ఆధారపడవద్దని, సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని ఆమె ఎమ్మెల్యేను కోరారు.

అన్నీ చూడండి

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..

శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరుమీద వచ్చిన మాసం కావడంతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అందుకే దీనిని శ్రావణ మాసం అని పిలుస్తారు. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినది, హయగ్రీవోత్పత్తి జరిగింది, గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోనే. గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యే ముందు చేపట్టే సంవిధానాన్ని శ్రావణి అని కూడా అంటారు. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీమహాలక్ష్మీ దేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ, వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని అందిస్తుందని నమ్మకం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది.

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు

ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.

అన్నీ చూడండి

ప్రేమ ఒకవైపు.. వివాహేతర సంబంధం మరోవైపు.. ప్రియుడి చేతిలో ప్రియురాలి హత్య

ప్రేమ ఒకవైపు.. వివాహేతర సంబంధం మరోవైపు.. ప్రియుడి చేతిలో ప్రియురాలి హత్య

ప్రేమ, వివాహ బంధాలు పెటాకులు అవుతున్నాయి. వివాహేతర సంబంధాలు నేరాలను పెంచేస్తున్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో ఒక మహిళ తన ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. ఇంకా తన ప్రియురాలిని హత్య చేసిన ఆ దుండగుడు ఆమెను దహనం చేశాడు. వివరాల్లోకి వెళితే.. కోట్ర గ్రామానికి చెందిన 22 ఏళ్ల నరుమల్ల అనుష కల్వకుర్తి పట్టణంలోని ఒక లేడీస్ కార్నర్ దుకాణంలో పనిచేసేది. ఆమె భర్త చెన్నయ్య ఒక హోటల్‌లో పనిచేస్తుండగా, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అనుషకు అదే గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది.

అన్నీ చూడండి

jony master :దళారులు లేకుండా కళాకారులకు నేరుగా చెల్లింపులు : టీ.జి. విశ్వ ప్రసాద్

jony master :దళారులు లేకుండా కళాకారులకు నేరుగా చెల్లింపులు : టీ.జి. విశ్వ ప్రసాద్

తెలుగు ఫిలిం & టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) 2025–2027 సంవత్సరానికి సంబంధించి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు, డ్యాన్సర్లు, డ్యాన్స్ డైరెక్టర్లు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రూ. 299 ప్లాన్‌తో సహా 1.5 జీబీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లను రద్దు చేసిన ఎయిర్‌టెల్

రూ. 299 ప్లాన్‌తో సహా 1.5 జీబీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లను రద్దు చేసిన ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్, ప్రజాదరణ పొందిన రూ. 299 ప్లాన్‌తో సహా, అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 1.5 జీబీ డేటాను అందించే అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిలిపివేసింది. వినియోగదారులు ఇప్పుడు అపరిమిత 5జీ డేటాను అందించే రూ. 349 ప్లాన్ వంటి అధిక ధర గల ప్యాక్‌లను ఎంచుకోవాలి. దీంతో, వినియోగదారులు రోజుకు అధిక డేటా వినియోగాన్ని అందించే ఖరీదైన ప్లాన్‌లను మాత్రమే ఎంచుకోవలసి వస్తోంది. ఈ టెల్కో రూ. 299, రూ. 319, రూ. 579, రూ. 619, రూ. 649 అనే ఐదు ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఉపసంహరించుకుంది.

అన్నీ చూడండి

అన్నీ చూడండి

అన్నీ చూడండి

అన్నీ చూడండి

  • బీఎస్ఇ 77792 174
  • ఎన్‌ఎస్ఇ 24344 92
  • బంగారం 154456 691
  • వెండి 236901 1242
  • గురువారం, 13 ఆగస్టు 2026 (10:07 IST)