ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి
వర్షాకాలం వచ్చేసింది, దీనితో పాటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు మన కుటుంబం మొత్తానికీ ఉన్న రోగనిరోధక శక్తిని పరీక్షిస్తాయి. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఇంట్లోని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుస్తుగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత సులభమైన మార్గం. చురుకైన జీవనశైలికి తోడుగా కాలిఫోర్నియా బాదం, తృణధాన్యాలు, మొక్కలు మరియు జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వంటి రోగనిరోధక శక్తికి మేలు చేసే సూపర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ సీజన్ అంతటా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు.
కాలిఫోర్నియా బాదం అనేది సహజంగానే పోషకాలతో నిండిన అలాంటి ఒక సూపర్ ఫుడ్. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు అవసరమైన జింక్, కాపర్, ఐరన్ తో సహా 24 రకాల పోషకాలను అందిస్తుంది. వర్షాకాలంలో రోగనిరోధక శక్తిపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో.. సులభమైన, పోషకాలతో కూడిన ఆహారం ఈ సీజన్‌లో సంపూర్ణ ఆరోగ్యానికి ఎలా మద్దతు ఇస్తుందో నిపుణులతో పాటు ప్రముఖ నటి సోహా అలీ ఖాన్ పంచుకున్నారు.
ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఎలా ఉండాలనే దానిపై న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అత్యంత తీవ్రంగా పరీక్షించబడే కాలం వర్షాకాలం. ఆహారం విషయంలో మనం తీసుకునే చిన్నచిన్న, స్థిరమైన నిర్ణయాలు మన రోగనిరోధక శక్తి సామర్థ్యంలో గణనీయమైన మార్పును తీసుకువస్తాయి. బాదం పప్పులను మీ దినచర్యలో భాగం చేసుకోవడం అలాంటి ఒక సులభమైన అలవాటు. ఇవి విటమిన్ ఇ తో సహా 24 పోషకాలను, మరియు అనేక పాలీఫెనాల్స్‌ను అందిస్తాయి. ఇవి రెండూ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి రోగనిరోధక శక్తికి తోడ్పడతాయి అని అన్నారు.
న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్ డైటెటిక్స్ రీజనల్ హెడ్ రితికా సమద్దర్ మాట్లాడుతూ, మన రోగనిరోధక శక్తికి అత్యంత శ్రద్ధ అవసరమైన సమయం వర్షాకాలం. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మనం ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, మనల్ని మనం రక్షించుకోవడంలో మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తికి తోడ్పడే పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలని నేను ఎల్లప్పుడూ నా క్లయింట్‌లకు సలహా ఇస్తుంటాను. తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్స్, కాలిఫోర్నియా బాదం పప్పులు నేను ప్రధానంగా సూచించే ఆహారాలు. కాలిఫోర్నియా బాదం సహజంగానే పోషకాలతో నిండి ఉంటుంది, రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు అవసరమైన కీలక పోషకాలైన జింక్, కాపర్, ఐరన్‌లను ఇది అందిస్తుంది. తద్వారా వర్షాకాలంలో మీ రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకోవడం అత్యంత సులభమైన మరియు ప్రభావవంతమైన ఎంపిక అని పేర్కొన్నారు.
ప్రముఖ నటి సోహా అలీ ఖాన్ తన అనుభవాలను పంచుకుంటూ, వర్షాకాలంలో నేను తీసుకునే ఆహారం పట్ల మరింత జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే వాతావరణ మార్పులు నా ఆరోగ్యం, శక్తి స్థాయిల పై ఎంత త్వరగా ప్రభావం చూపుతాయో నాకు తెలుసు. నా భోజనం సమతుల్యంగా ఉండేలా, అందులో రోగనిరోధక శక్తికి మేలు చేసే ఆహారాలు ఉండేలా నేను చూసుకుంటాను. కాలిఫోర్నియా బాదం ఎల్లప్పుడూ నా దినచర్యలో భాగమే. ఇవి సులభంగా తినగలిగేవి, పోషకమైనవి. అంతేకాకుండా అత్యంత బిజీగా ఉండే రోజుల్లో నా శక్తిని కాపాడుకోవడానికి, రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఈ అలవాటును అలవర్చుకునేలా కూడా నేను జాగ్రత్తపడతాను అని చెప్పారు.
వర్షాకాలం మొదలవుతున్న ఈ తరుణంలో, సరళమైన, వివేకవంతమైన పోషకాహార ఎంపికల ద్వారా మీ కుటుంబ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మీరు తీసుకోగల అత్యంత ప్రభావవంతమైన చర్య. ప్రతి సర్వింగ్‌లో 24 పోషకాలను అందించే కాలిఫోర్నియా బాదం.. సులభంగా, ప్రతిరోజూ తీసుకోగల ఒక సూపర్ ఫుడ్. ఈ వర్షాకాలంలో ఇది మీ కుటుంబం మొత్తానికి రోగనిరోధక శక్తిని, ఎనర్జీని, మరియు సంపూర్ణ శ్రేయస్సును అందిస్తుంది.
