1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Headmistress arrives at school with a large knife and a small knife; children terrified, Video

పాఠశాలకు పెద్ద కత్తి, చాకుతో వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు, పిల్లలు బెంబేలు, వీడియో

Teacher with knifes
పాఠశాలకు ఉపాధ్యాయులు పుస్తకాలను పట్టుకుని చదువు చెప్పేందుకు వస్తుంటారు కదా. ఇది అంతా చూసేదే. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తళతళ మెరిసిపోతున్న పెద్ద కత్తితో పాటు ఒక చాకును తీసుకుని వచ్చింది. వీటిని చూసిన పిల్లలు బెంబేలెత్తిపోయారు. స్కూలు పక్కనే వున్న పలువురు పెద్దలు పోలీసులకు సమాచారం అందించారు.
 
దీనితో పోలీసులు, విద్యాధికారులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఆమెను బైటకు పిలిచి వాటిని ఎందుకు తీసుకుని వచ్చారని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు చెప్పడం గమనార్హం. దీనితో ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఐతే మతిస్థిమితం లేని ఆమెను పాఠశాలకు వచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఎలా అంగీకరించారన్నది చర్చనీయాంశంగా మారింది.
About Writer
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సుప్రభాత సేవలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్‌నోవా