1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kalyanam Kamaneeyam Jeevitham Movie Teaser Impresses

Khan Durrani :ఆకట్టుకున్న కళ్యాణం కమనీయం జీవితం సినిమా టీజర్

Khan Durrani, Sahithi Avancha and Kalyanam Kamaneeyam Jeevitham team
Khan Durrani, Sahithi Avancha and Kalyanam Kamaneeyam Jeevitham team
ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కళ్యాణం కమనీయం జీవితం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, నిర్మాత మల్లిడి  సత్యన్నారాయణ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. 
 
అనంతరం డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ -ఈ టైటిల్ చూసి మీకు పెళ్లయ్యిందా అని డైరెక్టర్ ను అడిగాను. టీజర్ చూస్తే ఆకట్టుకునేలా ఉంది. ఇంత భారీగా తెరకెక్కించారు. తన లైఫ్ నుంచి ఇన్స్ పైర్ అయ్యి చేసిన సినిమా ఇదని డైరెక్టర్ రవి చెప్పారు. చాలామంది కొత్త దర్శకులు రూపొందించే ప్రేమ కథలు వారి నిజ జీవితాల నుంచి స్ఫూర్తి పొందినవే ఉంటాయి. అవన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. అలాగే "కళ్యాణం కమనీయం జీవితం" సినిమా కూడా మంచి విజయం సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
 
హీరోయిన్ సాహితి అవంచ మాట్లాడుతూ, ఇది  ఒక బ్యూటిఫుల్ ఫిలిం. అంతా ఫ్రెష్ టీమ్ ఈ మూవీకి వర్క్ చేశారు. ఆర్టిస్టులు కూడా చాలా మంది న్యూ యంగ్ టాలెంట్ నటించారు. మా సినిమా ప్లెజెంట్ గా ఉంటూనే చివరలో ఒక మంచి ట్విస్ట్ తో ఆకట్టుకుంటుంది. మా కొత్త టీమ్ చేసిన ఈ సినిమాను మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
 
హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ - మా ప్రొడ్యూసర్స్ గతంలో కొన్ని మంచి మూవీస్ చేశారు. నేను హీరోగా కొత్తవాడినైనా ఈ చిత్రంలో అవకాశం కల్పించారు. మా మూవీ టీజర్, సాంగ్స్ చూశారు కదా. మీ అందరికీ నచ్చాయని నమ్ముతున్నాం. సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉంటాయి. శ్రీ మురళి మా మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. "కళ్యాణం కమనీయం జీవితం" సినిమా ఒక కొత్త తరహా కథతో కథనంతో మీ అందరినీ ఆకట్టుకుంటుంది. మీ సపోర్ట్ మా మూవీకి ఉండాలి. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మురళీ కార్తికేయ మాట్లాడుతూ - నేను కంపోజర్ అయ్యేందుకు స్ఫూర్తినిచ్చిన మూవీ మనసంతా నువ్వే. ఆ చిత్ర దర్శకులు వీఎన్ ఆదిత్య గారు మా సినిమా ఈవెంట్ కు అతిథిగా రావడం, మా అందరికీ బెస్ట్ విశెస్ అందించడం సంతోషంగా ఉంది. అన్నారు. 
 
ప్రొడ్యూసర్ కిషోర్ గుండాల మాట్లాడుతూ - మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విజయేంద్రప్రసాద్ గారు చేశారు. అలాగే మా చిత్రంలో చంద్రబోస్ గారు పాట రాశారు. ఇప్పుడు వీఎన్ ఆదిత్య గారు అతిథిగా వచ్చారు. ఇంతమంది పెద్ద వాళ్ల సపోర్ట్ మా టీమ్ కు దక్కడం సంతోషంగా ఉంది. నేను కార్పొరేట్ ప్రపంచం నుంచి సినిమాల మీద ప్యాషన్ తో టాలీవుడ్ కు వచ్చాను. యూఎస్ లో ఫిలింమేకింగ్ మీద కోర్స్ చేశాను. గతంలో 24 కిస్సెస్ సహా మరికొన్ని చిత్రాలు నిర్మించాము. ఇప్పుడు "కళ్యాణం కమనీయం జీవితం" సినిమా చేస్తున్నాం. మరో సినిమా కూడా లైనప్ లో ఉంది. ఇదొక బ్యూటిఫుల్ ఫిలిం. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అన్నారు.
 
డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ - నా ఎన్నో ఏళ్ల కష్టం ఈ సినిమా వెనక ఉంది. నా నిజ జీవితంలోని కొన్ని ఇన్సిడెంట్స్ కు ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాను. చాలా మంచి లవ్ స్టోరీ ఇది. డ్రామా, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ కథ రాసినప్పుడు రైటర్ అరవింద్ ఒక కొత్త పాయింట్ ను యాడ్ చేశాడు. ఆ పాయింట్ తో మూవీ స్క్రిప్ట్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.  మా ప్రొడ్యూసర్స్ ఎంతో సహకరించారు అన్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Varun Tej: కొరియన్ కనకరాజు లో దక్షా నాగర్కర్‌, వరుణ్ తేజ్ లపై స్పెషల్ సాంగ్