Priyanka Chopra: వారణాసి నుండి ప్రియాంక చోప్రా కొత్త లుక్ పోస్ట్ చేసిన రాజమౌళి
Rajamouli posts 's new look from Varanasi
ఎస్.ఎస్. రాజమౌళి తన తాజా సినిమా 'వారణాసి' నుంచి ఏదో ఒక వార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అవి వైరల్ కావడం జరుగున్న విషయం తెలిసిందే. పబ్లిసిటీకి పెద్దగా ఖర్చు చేయకుండా ఆయన మార్కెటింగ్ అంచనాను ఏ దర్శక నిర్మాత కూడా అందుకోలేదు. తాజాగా ఆయన వారణాసి నుండి ప్రియాంక చోప్రా కొత్త లుక్ ను తన ఇన్ స్ట్రాలో విడుదల చేశారు.
ఇందులో మందాకిని అనే ఫెరేషియస్ పాత్రలో ఆమె నటిస్తోంది. అంతకుముందు ఆమె పసుపు చీరకట్టులో యాక్షన్ పార్ట్ చేతిలో తుపాకితో ఇచ్చిన స్టిల్ చాలా వైరల్ అయింది. తాజాగా ఈ స్టిల్ బాగా నెటిజన్లను ఆకట్టుకుంది.
సోషల్ మీడియా అంతటా అభిమానుల దృష్టిని తక్షణమే ఆకర్షించింది. ఆమె అద్భుతమైన, ఉగ్రమైన లుక్ వైరల్ అవ్వగా, చాలా మంది ఆమె రూపాంతరాన్ని ప్రశంసిస్తున్నారు.
మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'వారణాసి' చిత్రాన్ని రాజమౌళి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కీరవాణి సంగీత సారథ్యంలో ఇప్పటికే ట్యూన్స్ సెట్ అయ్యాయి.
