బుధవారం, 12 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2025 (12:17 IST)

వరకట్నం వేధింపులు.. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్య

Crime
వరకట్నం వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గోపాలపట్నం పరిధిలోని జీవీఎంసీ 91వ వార్డు రామకృష్ణనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతురాలి భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు సమర్పించారు. ఉద్యోగరీత్యా దిలీప్‌, శ్యామల గత కొన్ని నెలలుగా రామకృష్ణనగర్‌లో నివాసం ఉంటున్నారు. దిలీప్‌ శివకుమార్‌ గత కొద్ది నెలలుగా అదనపు కట్నం కోసం శ్యామలను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 
 
భర్త ఇంట్లో లేని సమయం చూసి, ఆదివారం అర్ధరాత్రి శ్యామల ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు మృతదేహం పక్కన శ్యామల రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.