మంగళవారం, 9 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 డిశెంబరు 2025 (15:53 IST)

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

akhanda-2
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న అఖండ-2 చిత్రం విడుదల తేదీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. నిజానికి ఈ చిత్రం ఈ నెల 5వ తేదీన విడుదల కావాల్సివుండగా, ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. దీంతో ఈ చిత్రం విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. దీంతో సినిమా విడుదలను నిలిపివేశారు. 
 
ఈ నేపథ్యంలో చిత్రం విడుదలకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఆదివారం డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం జరిగింది. అప్పటికే ఓవర్సీస్ పంపిణీదారులు  డిసెంబరు 12వ తేదీన సినిమాల విడుదల చేయాలని నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారు. క్రిస్మస్‌కు సినిమా రిలీజ్ అయితేనే వర్కౌట్ అవుతుందని స్థానిక పంపిణీదారులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో చిత్ర హీరో బాలకృష్ణ మాత్రం నిండగా నిలబడ్డారు. ఈ సినిమాకుగానూ ఇంకా ఆయనకు ఏడు కోట్ల రూపాయలను నిర్మాతలు ఇవ్వాల్సి ఉంది. వాటిని వదులుకోవటంతో పాటు, 10 కోట్ల రూయలను నిర్మాతలకు ఆయన వెనక్కి ఇచ్చినట్టు సమాచారం. అఖండ 2 సినిమాను బాలకృష్ణ పారితోషికం 45 కోట్లుగా ప్రచారంలో ఉంది.
 
ఇక నిర్మాతలతో సెటిల్మెంట్‌కు అందుబాటులో లేని ఏరోస్ సంస్థ అధినేతలు.. తమకు రావాల్సిన 28 కోట్లు చెల్లించాల్సిందేనంటూ మంకుపట్టుపట్టారు. అందుకు తగ్గటుగా ఎన్ఓసి సిద్దం చేసి, వారి ఫారిన్ వెళ్లినట్లుగా సమాచారం. ఇక డిసెంబరు 5వ తేదీ అఖండ2 రిలీజ్ అవుతుందనని భావించిన పలువురు ఎగ్జిబిటర్స్ .. 10 రూపాయల వడ్డీలకు అప్పులు తీసుకుని అఖండ 2ను తమ థియేటర్స్‌లో ప్రదర్శించెందుకు పంపిణీదారులకు డబ్బులు కూడా చెల్లించారు. 
 
తీరా సినిమా విడుదల కాకపోవడంతో వారు కూడా నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారు. సినిమా వీలైనంత త్వరగా రిలీజ్ కాకుంటే, అలాంటి ఎగ్గిబిటర్స్‌కు ఆర్థికంగా ఇబ్బందే అంటున్నారు‌. ఈ పరిస్థితుల్లో ఓవర్సీస్‌లోని కొన్ని ఏరియాస్‌లో అఖండ 2 టిక్కెట్ బుకింగ్స్ డిసెంబరు 11 ప్రీమియర్స్ కోసం విడుదల చేశారనే వార్త అందరికీ కాస్త ఊరటనిస్తొంది.