నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్
నార్సిసిస్టిక్ స్త్రీలు తమ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుని తమ సొంత కుటుంబాలను నిర్మించుకుంటున్నారని నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఒక రహస్య పోస్ట్ చేశారు. "నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? ఇది చాలా బాధాకరం. పైగా ఆమె చాలా శక్తిమంతమైనది, చదువుకున్నది, అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి. బలహీనమైన, నిరాశతో ఉన్న పురుషులను డబ్బు కొనుగోలు చేయగలదు" అని పూనమ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్ టైమింగ్ వల్లే ఈ వివాదం రాజుకుంది. దర్శకుడు రాజ్ నిడిమోరును సమంత నిన్న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, రాజ్‌కు ఇదివరకే శ్యామలాదేవి అనే మహిళతో వివాహమై, పిల్లలు కూడా ఉన్నారు.
సమంతతో సంబంధం కారణంగానే ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పూనమ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో నెటిజన్లు ఈ ట్వీట్‌ను సమంత వివాహంతో ముడిపెడుతూ కామెంట్లు చేస్తున్నారు.