మంగళవారం, 2 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2025 (17:55 IST)

Kavya Thapar: నేను రెడీ హీరోయిన్ కావ్య థాపర్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్

Kavya Thapar poster,
Kavya Thapar poster,
నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాల  హీరో హవీష్ తో దర్శకుడు నక్కిన త్రినాథరావు రూపొందుతున్న మూవీ "నేను రెడీ". ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి బ్యానర్ పై  నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.
 
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన హీరోయిన్ కావ్య థాపర్ బర్త్ డే పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. "నేను రెడీ" మూవీ తన కెరీర్ లో ది బెస్ట్ గా నిలుస్తుందని ఆశిస్తోంది కావ్య థాపర్. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి మంచి ఔట్ పుట్ వస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన  టైటిల్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మరింత కాన్ఫిడెంట్ గా చిత్రీకరణ జరుపుతున్నారు మూవీ టీమ్.
 
నటీనటులు - హవీష్, కావ్య థాపర్, శ్రీలక్ష్మి, గోపరాజు రమణ, హరి తేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్, తదితరులు