బుధవారం, 12 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2025 (15:37 IST)

Sky: స్కై సినిమా నుంచి నిన్ను చూసిన.. లిరికల్ సాంగ్

Murali Krishnam Raju, Shruti Shetty
Murali Krishnam Raju, Shruti Shetty
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా "స్కై". పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న "స్కై" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
తాజాగా ఈ చిత్రం నుంచి 'నిన్ను చూసిన..' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు పృథ్వీ పెరిచెర్ల మంచి లిరిక్స్ రాయగా, మనీష్ కుమార్, వైష్ణవి ఆకట్టుకునేలా పాడారు. శివప్రసాద్ బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. "స్కై" సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన 'తపనే తెలుపగ..', 'పోయేకాలం నీకు..' సాంగ్స్ ఛాట్ బస్టర్స్ గా మారి మిలియన్ వ్యూస్ రీచ్ అయ్యాయి. తాజాగా రిలీజ్ చేసిన ఈ 'నిన్ను చూసిన..' సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ఆదరణ పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
 
నటీనటులు - మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ, తదితరులు