మంగళవారం, 2 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2025 (19:12 IST)

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

Sivakarthikeyan, Rukmini Vasanth
Sivakarthikeyan, Rukmini Vasanth
శివకార్తికేయన్‌, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో మదరాసి సినిమా రూపొందుతోంది. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ప్రెజెన్స్ కమర్షియల్ స్పేస్‌కి కొత్తదనం తీసుకురానుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఆగస్టు 24న జరగనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆయనకు క్రూషియల్  కమ్ బ్యాక్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఇందులో శివకార్తికేయన్‌ని ఫుల్ మాస్, ఫియర్స్ లుక్‌లో చూపించనున్నారు.
 
ట్రైలర్ పోస్టర్‌లో శివకార్తికేయన్‌తో పాటు విద్యూత్ జమ్మ్వాల్, బిజు మెనన్, విక్రాంత్‌లను కూడా ఇంటెన్స్ లుక్‌లో ప్రజెంట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సెలవికా, లవ్ ఫెయిల్యూర్ ఆంథమ్‌గా మారి మంచి హిట్ సాధించింది.
 
శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్ స్కేల్‌లో  నిర్మిస్తున్నారు. ఇందులో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా ఉండబోతోంది. సినిమాటోగ్రఫీని సుదీప్ ఎలామోన్ హ్యాండిల్ చేస్తున్నారు. రెండు రోజుల్లో ట్రైలర్, ఆడియో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ‘మదరాసి’పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేట్రికల్ రిలీజ్ కానుంది.