బుధవారం, 12 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2025 (18:06 IST)

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

tamanna bhatia
మహిళల శరీరాకృతిపై ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా స్పందించారు. మహిళల వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి వారి శరీరాకృతిలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. అందువల్ల మహిళల శరీరాకృతి ఒకేలా ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. 
 
బరువు తగ్గేందుకు ఇంజెక్షన్లు వాడుతున్నారంటూ తనపై సాగుతున్న ప్రచారంపై తమన్నా తాజాగా స్పందించారు. మహిళలు ఎల్లపుడూ ఒకే శరీరాకృతితో కనిపించలేరన్నారు. మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదని, ఐదేళ్లకు ఓసారి మార్పులు జరుగుతుంటాయని పేర్కొన్నారు. 
 
15 యేళ్ల వయసు నుంచే తాను నటిస్తున్నానని తెలిపారు. అపుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నానని తాను భావిస్తున్నట్టు తెలిపారు. అయితే, సినిమాల్లోని పాత్రల కోసం ఒక్కోసారి బరువు పెరగడం, మరోసారి బరువు తగ్గడం చేయాల్సి వస్తుందని తమన్నా వివరించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టానని, కెమెరాతో తన ప్రయాణం సాగుతోందని, ఇందులో దాచిపెట్టడానికి ఏమీ లేదన్నారు.