Astrology Monthly Horoscope Details

Notifications

కుంభం కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు మీదైన రంగంలో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. చెల్లింపులు, నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సంతానం పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధిస్తారు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. ఓర్పుతో మరోసారి యత్నించండి. నేడు సాధ్యం కానిది రేపు అనుకూలించవచ్చు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో చర్చలు జరుపుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.

సీఎం విజయ్ కేబినెట్ మహిళా మంత్రిపై యూట్యూబర్ మారిదాస్ అసభ్యకర వీడియో?: అతడు బైటకు రావడం కష్టమేనా?

సీఎం విజయ్ కేబినెట్ మహిళా మంత్రిపై యూట్యూబర్ మారిదాస్ అసభ్యకర వీడియో?: అతడు బైటకు రావడం కష్టమేనా?తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేబినెట్లో మహిళా మంత్రిపై తమిళనాట ప్రముఖ యూ ట్యూబర్ మారిదాస్ అసభ్యకరమైన వీడియోను చేసి పోస్ట్ చేసారని ఆరోపణలు వచ్చాయి. దీనితో అతడిపై చెన్నై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదయ్యింది. సోమరవారం ఉదయం మధురైలోని అతడి నివాసానికి చెన్నై పోలీసులు వెళ్లారు. మధురై నగర పోలీసులను వెంటబెట్టుకుని అతడి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసారు. కాగా మారిదాస్ ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గంలోని మహిళా మంత్రితో పాటుగా మరికొందరు మంత్రులకు వ్యతిరేకంగా వీడియోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 79, 352(2) కింద కేసు నమోదు చేసారు.

Minor girl: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై భవనం పైనుంచి కిందకు తోసేశాడు..

కుక్క కరిచిన వ్యక్తి ఎలా అయిపోయాడో చూడండి, వీడియో

Positive Energyని నాశనం చేసే రాక్షస స్నానం, ఏమిటి ఈ స్నానం?

07-06-22 ఆదివారం ఫలితాలు - సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది