Astrology Monthly Horoscope Details

Notifications

వృశ్చికం వృశ్చికం
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు ప్రతికూలతలు అధికం. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవావాలి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. కొత్త ఆలోచనలుర స్ఫురిస్తాయి. మొండిగా పనులుర పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. సంతానం దుడుకుతనం అదుపు చేయండి. ఊహించని సంఘటనలెదురవుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. ఒంటెద్దు పోకడ తగదు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. కనిపించకుండా పోయిన వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. విందుకు హాజరవుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.

కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్.. నాలుగేళ్ల చిన్నారి మృతి.. నివారణ చర్యలు ముమ్మరం

13 ఏళ్ల కుమారుడిని చంపిన తండ్రి.. ఆపై ఆత్మహత్య

13 ఏళ్ల కుమారుడిని చంపిన తండ్రి.. ఆపై ఆత్మహత్యనల్గొండలోని కనకదుర్గ నగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్న పబ్బతిరెడ్డి లింగారెడ్డి (45), సోమవారం సాయంత్రం తన 13 ఏళ్ల కుమారుడు ప్రణీత్ రెడ్డిని చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు నల్గొండ మండలం మిర్లోనిగూడెంకు చెందినవారు. లింగారెడ్డి విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తుండగా, ప్రణీత్ నల్గొండలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. లింగారెడ్డి తన కుమారుడి తలపై సుత్తితో కొట్టి, ఆ తర్వాత పురుగుల మందు తాగి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో, ఒక కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న తమ పెద్ద కుమారుడిని కలిసేందుకు అతని భార్య హైదరాబాద్ వెళ్లగా, అతని తండ్రి ఉదయాన్నే పొలానికి వెళ్లారు.

నూజివీడులో బెట్టింగ్ బానిస, ఆఫీసులో ఉరి వేసుకుని ఆత్మహత్య

నూజివీడులో బెట్టింగ్ బానిస, ఆఫీసులో ఉరి వేసుకుని ఆత్మహత్యబెట్టింగ్. ఈ వ్యసనంలో పడి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ బారిన పడవద్దని పోలీసులు ఎంతగా చెవినిల్లు కట్టుకుని చెప్పినా కొంతమంది మాత్రం ఆ వ్యసనం నుంచి బైట పడలేకపోతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఓ డాక్యుమెంట్ రైటర్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్నాడు. అతడు క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్... తదితర వ్యసనాలకు 35 ఏళ్ల షేక్ సుభాని బానిసయ్యాడు. దీనితో అందినకాడికి అప్పులు చేసాడు. బెట్టింగ్ ఊబిలో పూర్తిగా కూరుకుపోయాడు. అప్పులవాళ్లు తమ డబ్బులు తమకు ఇవ్వమంటూ గోల చేస్తుండటంతో ఏ దారి లేక చివరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పెళ్లి పీటలపై ఆగిన పెళ్లి.. వధువు జంప్.. వరుడికి చెల్లెనిచ్చి చేద్దామనుకుంటే..?

పెళ్లి పీటలపై ఆగిన పెళ్లి.. వధువు జంప్.. వరుడికి చెల్లెనిచ్చి చేద్దామనుకుంటే..?యూపీలో పెళ్లి పీటలపై ఆగిపోయింది. పెళ్లికొడుకు ఊరేగింపు కల్యాణమండపానికి చేరుకున్న తరుణంలో వధువు అదృశ్యమైన విషయం తెలియడంతో వధువు కుటుంబ సభ్యులు అవమానానికి గురయ్యారు. కానీ పెళ్లి ఆగకుండా వుండేందుకు ఇరువైపుల పెద్దలు పంచాయితీ పెట్టి వధువు చిన్న చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ ప్రతిపాదనకు ఆ చిన్న కూతురు నో చెప్పింది. తనకు వేరే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందని, ఈ పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమె ప్రియుడు కూడా నేరుగా పెళ్లిమండపానికి చేరుకుని తామిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

07-06-22 ఆదివారం ఫలితాలు - సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది

07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమే

07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమేమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం పరిస్థితులు క్రమంగా చర్చబడతాయి. నిర్దేశిత లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయాలు, వ్యాపారాలు అధికమవుతాయి. మంగళవారం వాడు పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం, సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన శ్రేయస్కరం. పెద్దల సలహా పాటించండి. జూదాలకు పోవద్దు. ఆప్తులతో తరచు సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు బదిలీ. అధికారులకు హోదా మార్పు, వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.