నవంబరు 14 రెండో శనివారం పని దినమే : స్పష్టం చేసిన ఏపీ సర్కారు
ఈ నెల 14వ తేదీ శనివారం రెండో శనివారం అయినప్పటికీ పనదినంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణంగా ప్రతి నెల రెండో శనివారం సెలవుగా ఉంటుంది. అయితే, వచ్చే రెండో శనివారాన్ని మాత్రం ప్రభుత్వం సెలవు ఇవ్వకుండా పనిదినంగా తీసుకుంది. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ విషయంపై నెలకొన్న గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది.
దసరా పండుగ సందర్భంగా అక్టోబరు 19వ తేదీ ఐచ్ఛిక సెలవును ఉద్యోగులు వినియోగించుకున్నారని, దానికి బదులుగా నవంబరు 14వ తేదీన పనిదినంగా పరిగణించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫలితంగా మెజారిటీ ఉద్యోగులు ఆ రోజున విధులకు హాజరుకావాల్సివుంది.
అయితే, ఈ నిబంధన నుంచి కొందరికి మినహాయింపు కల్పించారు. అక్టోబరు 19వ తేదీన ఎన్నికల విధులు, దసరా ఉత్సవాల డ్యూటీలు, విజయవాడలో నిర్వహించిన సరస్ ేదా ఇతర తప్పనిసరి అధికారిక విధుల్లో వుండి సెలవు తీసుకోలేకపోయిన ఉద్యోగులు మాత్రం నవంబరు 14వ తేదీన సెలవు తీసుకునే వెసులుబాటును కల్పించింది.
ఈ పరిహార సెలవు పొందాలంటే సంబంధిత ఉద్యోగి అక్టోబరు 19వ తేదీన విధుల్లో ఉన్నట్టుగా అధికారిక రికార్డుల ాధారంగా పై అధికారులు ధృవీకరించాల్సి వుంటుంది. ఈ ధృవీకరణ అనంతరం వారికి సెలవు మంజూరు చేస్తారు. మిగిలిన ఉద్యోగులంతా యధావిధిగా ఈ నెల 14వ తేదీన విధులకు హాజరుకావాల్సివుంటుందని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

