RAPO23 Update: తోడేలు భావాలున్న వ్యక్తి కథ గా రామ్ పోతినేని రాపో23 చిత్రం
Ram Pothinenis 'RAPO23' neo-noir pre-look
అతని సోదరుడు కృష్ణ 'రాపో సినిమాటిక్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ మరియు సంయుక్త నటిస్తున్నారు. సామ్ సిఎస్ వంటి అగ్రశ్రేణి ప్రతిభావంతులు సంగీతం అందిస్తుండగా, తిర్రు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది, ఇది తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త యాక్షన్ చిత్రంగా నిలుస్తుందని వాగ్దానం చేస్తోంది.
కథానాయకుడు రామ్ పోతినేని నటిస్తూ, దర్శకత్వం వహింస్తున్న #RAPO23 చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా, #RAPO23 చిత్రం యొక్క ఆసక్తికరమైన 'ప్రీ-లుక్'ను మీ ముందు ఉంచుతున్నాం. టైటిల్ టీజర్ త్వరలో రానుంది! అంటూ పేర్కొన్నారు. లోన్ వోల్ఫ్ (ఏకాకి తోడేలు) కథ అంటూ హింట్ ఇచ్చారు.
రామ్ పోతినేని పాత్ర డిజైన్ కూడా చిత్రంగా వుంటుంది. ఎవరిపైనా ఆధారపడకుండా, స్వతంత్రంగా జీవిస్తూ, తన దారిని తానే ఎంచుకుని, ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే వ్యక్తి. 'లోన్ వోల్ఫ్' తో పోల్చారు. స్వతంత్రంగా తన దారిని తానే ఎంచుకుని, ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే వ్యక్తి.కథగా రూపొందుతోందని తెలుస్తోంది.
ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక మూవీలో విలన్ గా బాలీవుడ్ హీరో, స్టార్ హీరోయిన్ జెనీలియా భర్త రితేశ్ దేశ్ ముఖ్ నటించనున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను డిసెంబర్ 2026లో విడుదల కానుంది.
నటీనటులు: నివేదా పేతురాజ్, సంయుక్త మీనన్ మరియు రితీష్ దేశ్‌ముఖ్ తదితరులు
దర్శకత్వం & రచన: రామ్ పోతినేని, సంగీత దర్శకుడు: సామ్ సి.ఎస్., ఛాయాగ్రహణం: తిరునావుక్కరసు, స్టంట్ మాస్టర్: పీటర్ హెయిన్,

