1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Aadarsha Kutumbam Movie Review: Venky and Trivikram Deliver a Breezy Family Entertainer

Aadarsha Kutumbam Movie Review: సరదాగా సాగే ఆదర్శ కుటుంబం ..రివ్యూ

adarsa kutumbam
adarsa kutumbam
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడే (అక్టోబర్ 30)న విడుదలైంది. 
 
కథ.
సామాన్య కుటుంబానికి చెందిన వారు వెంకీ, శ్రీనిధిశెట్టి, ఇద్దరు పిల్లలు. వెంకీ కి ఉద్యోగం పోతుంది. అదే టైమ్ లో 100 కోట్ల లాటరీ దక్కుతుంది. ఆ తర్వాత వారు హై సొసైటీ లో విల్లా 47 నెంబర్ ఇళ్లు తీసుకుంటారు. మరో వైపు బీహార్ కి చెందిన హంతకుల ముఠా రిచ్, ఫేమస్ అయిన వారిని టార్గెట్ చేసి దారుణంగా చంపి నగలు, డబ్బు దోచుకుంటారు. పోలీసులకు ఛాలెంజీ గా మారుతుంది. లాటరీ తో ఫేమస్ అయిన వెంకీ ఫ్యామిలీ ను గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది.అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
వెంకటేష్ చేసిన ఈ సినిమా ఆడియన్స్ కు ఎంటర్టైన్ చేసింది. నలుగురు ఫ్యామిలీ కాదు. కానీ వెంకీ నీ మిగిలిన వారిన్ని కలిపిన విధానం సరదాగా అనిపిస్తుంది. పోలీసు డిపార్ట్మెంట్ కి సవాలుగా మారిన గ్యాంగ్ ను వెంకీ సాల్వ్ చేసే విధానం త్రివిక్రమ్ ట్రీట్ మెంట్ బాగుంది.
 
నటనపరంగా అందరూ వారి పాత్రలో లీనమయ్యారు. సత్య పాత్ర ఫుల్ జోష తెప్పిస్తుంది. రఘు బాబు, నారా రోహిత్ పాత్రలు డిజైన్ బాగుంది. ఎక్కడా బోర్ లేకుండా సినిమా టిక్ ఫ్రీడం తో. కథనం సాగుతుంది. వెంకీ ఫ్యామిలీ ట్విస్ట్ బాగుంది. 
 
సాంకేతికంగా.. త్రివిక్రమ్ మాటలు హైలెట్. కథనం, సీన్స్ పొందిక లాజిక్స్ గా అనిపిస్తాయి. ఇక తమన్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. యాక్షన్ సీన్స్ హైలెట్, ట్రైన్ ఫైట్ బాగుంది. ఇలా చాలా కేర్ తీసుకుని చేసిన సినిమా.. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఫ్యామిలీతో చూసే సినిమా ఇది. 
 
రేటింగ్: 3/5
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ 10.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్?