కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నా...మళ్లీ బీఆర్ఎస్ గూటికి కొండా ఖాయమా?
అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో తాను అలా మాట్లాడినట్టు చెప్పారు. నిరాధారమైన ఆ వ్యాఖ్యలు చేసి ఉండకూడదన్నారు. కేటీఆర్, కుటుంబ సభ్యులను బాధ పెట్టాలని.. వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం తనకు లేదన్నారు.
తన వ్యాఖ్యలతో కేటీఆర్, ఆయన కుటుంబసభ్యులను నొప్పించి ఉంటే చింతిస్తున్నానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. కాగా, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ ఇపుడు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

