1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YCP Leader Jogi ramesh daughter in law family car accident suspected murder attempt

మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్.. హత్యాయత్నమా?

meghana
వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. తన కుమార్తె మేఘనతో కలిసి ప్రయాణిస్తుండగా జరిగిన కారు ప్రమాదంపై ఆమె తండ్రి కృష్ణ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం వెనుక జోగి రమేశ్ హస్తం ఉండొచ్చని ఆరోపిస్తూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
అక్టోబరు 15వ తేదీన జోగి రమేశ్ కోడలు మేఘన, ఆమె తండ్రి కృష్ణ విజయవాడ నుంచి తెలంగాణలోని కోదాడకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతింది. అయితే, ఇది సాధారణ ప్రమాదం కాదని, తమను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిగా కృష్ణ భావిస్తున్నారు.
 
ఈ మేరకు అక్టోబరు 16న ఆయన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. తమకు ప్రాణహాని ఉందని, ఈ ప్రమాదం వెనుక జోగి రమేశ్ హస్తం ఉండే అవకాశం ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బస్సు డ్రైవరుపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమికంగా విచారణ జరుపగా ఇది ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగిందని కాదని పేర్కొన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఏపీలో స్థానిక సమరం : సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ పంచాయతీల్లో పోలింగ్ వాయిదా