1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Despite Being in Power, TDP Sees Fall in Donations

వైకాపాకు విరాళాలు ఇచ్చేవారే కరవాయే... టీడీపీ తగ్గిన నిధులు

ycp - tdp flags
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు వచ్చే విరాళాల్లో భారీగా తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా, అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీకీ, అధికారంలో లేని వైకాపాకు ఈ విరాళాల్లో భారీ తగ్గుదల కనిపించింది. వైకాపాకు విరాళాలు ఇచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత యేడాదిలో ఈ తగ్గుదల కనిపించింది. 
 
ముఖ్యంగా, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విరాళాలు తగ్గగా, ప్రతిపక్ష హోదాలో ఉన్న వైకాపాకు అందిన విరాళాల్లో భారీ పతనం కనిపించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.20 వేలకు మించి స్వీకరించిన విరాళాలన ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. 
 
ఆ నివేదికల ప్రకారం 2025-26లో వైకాపాకు కేవలం రూ.24.31 కోట్ల విరాళాలు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఈ మొత్తం రూ.140.04 కోట్లుగా ఉండటం గమనార్హం. అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి విరాళాలు ఇచ్చేవారి సంఖ్య లేకుండా పోయింది. ఫలితంగా వైకాపా విరాళాల్లో 82 శాతం క్షీణత కనిపించింది. 
 
మరోవైపు, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విరాళాలు కూడా తగ్గాయి. ఆ పార్టీకి కేవలం రూ.58.25 కోట్లు వచ్చాయి. అంతకుముందు యేడాది ఈ మొత్తం రూ.83.03 కోట్లుగా ఉంది. అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పారటీ అందిన విరాళాలు కూడా దాదాపు 30 శాతం మేరకు తగ్గుముఖం పట్టాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వైజాగ్‌లో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య