1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. MLA Giddi Eswari fire on Pawan Kalyan

పవన్ సినిమాలన్నీ ఫ్లాప్.. అందుకే పొలిటికల్ ఎంట్రీ : గిడ్డి ఈశ్వరి

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్‌పై వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన గిడ్డి ఈశ్వరి విమర్శలు గుప్పించారు. సినీ రంగంలో వరుస ఫ్లాప్‌ను చవిచూడటం వల్లే అక్కడ ఇక కెరీర్ లేదని భావించ

Giddi Eswari
జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్‌పై వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన గిడ్డి ఈశ్వరి విమర్శలు గుప్పించారు. సినీ రంగంలో వరుస ఫ్లాప్‌ను చవిచూడటం వల్లే అక్కడ ఇక కెరీర్ లేదని భావించిన పవన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారంటూ వ్యాఖ్యానించారు.
 
ప్రజా పోరాట యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై గిడ్డి ఈశ్వరి స్పందిస్తూ, సినిమాలు హిట్ కాకపోవడం వల్లనే పవన్ కల్యాణ్ పర్యటనలు చేస్తున్నారంటూ ఎద్దేవాచేశారు.
 
పవన్‌ కల్యాణ్‌కు సినీరంగంలో అనుభవం ఉండవచ్చని, కానీ రాజకీయ రంగంలో పరిపక్వత లేదన్నారు. మన్యం అభివృద్ధి చంద్రబాబు పెట్టిన భిక్ష అని, ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదన్నారు.
 
ఈ విమర్శలపై పవన్ ఫ్యాన్స్ ఘాటుగానే స్పదించారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరేంత రాజకీయాలు పవన్‌కు తెలియవంటూ సోషల్‌ మీడియా వేదికగా సటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన గిడ్డి.. పార్టీ ఫిరాయించగానే చంద్రబాబును ఎలా వెనుకేసుకొస్తారంటూ నిలదీస్తున్నారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
టీడీపీకి హోంమంత్రి చినరాజప్ప రాజీనామా... ఎందుకంటే..