1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. India advises nationals in France to remain vigilant amid unrest, curfews

ఫ్రాన్స్‌కు వెళుతున్నారా.. అయితే, తస్మాత్ జాగ్రత్త.. ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ

france roits
గత కొన్ని రోజులుగా ఫ్రాన్స్ దేశంలో అల్లరు జరుగుతున్నాయి. ఇవి తారా స్థాయికి చేరాయి. దీంతో ఫ్రాన్స్‌లో పర్యటించాలని భావించే భారత ప్రజలకు ఇండియన్ ఎంబసీ ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. భారత్‌లో నివసిస్తున్న, పర్యటిస్తున్న భారతీయ ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని బుధవారం ఓ ప్రకటనలో కోరింది. ఫ్రాన్స్ దేశంలో చెలరేగుతున్న ఆందోళనల కారణంగా ట్రావెల్, భద్రతా సలహాను విడుదల చేసినట్టు స్పష్టం చేసింది. 
 
ఫ్రాన్స్ సెప్టెంబరు చివరిలో పాఠశాలల్లో సౌకర్యాల కొరత, ఉపాధ్యాయుల కొరతపై ప్రారంభమైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా వ్యాపించాయి. పెరుగుతున్న జీవన వ్యయం, అధిక ఇంధన ధరలు, ప్రభుత్వ బడ్జెట్ కోతలు, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పరిపాలనపై అసంతృప్తి వంటి కారణాలతో ఈ ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉన్న ప్రదేశాలకు, నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని భారత ఎంబసీ సూచించింది.
 
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఎంబసీ ఒక ప్రకటన విడుదల చేసింది. "ఫ్రాన్స్‌లో ఇటీవల నెలకొన్న పరిణామాలు, స్థానికంగా విధిస్తున్న కర్ఫ్యూల దృష్ట్యా, దయచేసి అప్రమత్తంగా ఉండండి. పెద్ద సమూహాలకు, నిరసనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండండి. స్థానిక ఫ్రెంచ్ అధికారులు జారీ చేసే సూచనలను పాటించండి" అని సూచించింది. 
 
ముఖ్యంగా ఆందోళనల కారణంగా రోడ్డు, ప్రజా రవాణా వ్యవస్థలకు అంతరాయం కలగవచ్చని, ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ విమానయాన సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరపాలని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ప్యారిస్‌లోని భారత రాయబార కార్యాలయం (+33 648 340063), మార్సెయ్‌‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (+33 743 162559) నంబర్లను సంప్రదించవచ్చని వెల్లడించింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయిన బియ్యం ధరలు