మురసు తుఫాను ఎఫెక్ట్ .. లోతట్టు ప్రాంతాలను తరలించండి : పవన్ కళ్యాణ్
మురసు తుఫాను ప్రభావం కారణంగా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురిక్షిత ప్రాంతాలకు తరలించారని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆయన మురసు తుఫానుపై సోమవారం సమీక్ష చేశారు. ముఖ్యంగా, తన పరిధిలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై తుఫాను ప్రభావం చూసే అవకాశం ఉందని, అందువల్ల అధికారులు తుఫాను గండం నుంచి బయటపడేంత వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ముఖ్యంగా, అత్యంత భారీ వర్షాల హెచ్చరికలు ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వాగులు, వంకల సమీపంలో జన సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సమన్వయం చేసుకోవాలి పవన్ దిశానిర్దేశం చేశారు. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ప్రజలకు సూచించారు.

