1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Post-production work, including CG (computer-generated) tasks, is underway for Varanasi

Varanasi update :వారణాసి సి.జి. పనులు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి

Varanasi cg work
Varanasi cg work
ఇంతకుముందెన్నడూ లేని ఒక అద్భుతమైన కార్యక్రమం వారణాసి టీజర్ విడుదలై అప్పుడే ఏడాది గడిచిపోయింది. ఈవెంట్‌ను ఇప్పటికీ వేడుకగా జరుపుకుంటున్న ప్రతి అభిమానికి ధన్యవాదాలు. ఆనాటి వీడియోలు, మధుర క్షణాలు ఇప్పటికీ ప్రతిరోజూ మా సోషల్ మీడియా టైమ్‌లైన్‌లలో కనిపిస్తూనే ఉన్నాయి అని వారణాసి టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
నవంబర్ 15, 2025న జరిగిన ఈ సమావేశంలో వారణాసి టైటిల్,  టీజర్‌ను ఎస్.ఎస్. రాజమౌళి ఆవిష్కరించారు. 1.43:1 ఐమాక్స్ ఫార్మాట్‌లో భారతదేశపు మొట్టమొదటి చిత్రంగా దీని భారీ స్థాయిని ఈ సందర్భంగా హైలైట్ చేశారు. మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయగా, ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటించారు. ఈ బహుళ-యుగ సాహసగాథ ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అభిమానులు పాత జ్ఞాపకాలను గుర్తుచేసే క్లిప్‌లు, భావోద్వేగ సందేశాలు మరియు వామిక వారణాసి అనే పాప కథ వంటి వాటిని పంచుకున్నారు. అదే సమయంలో, అధిక థియేట్రికల్ హక్కుల గురించిన చర్చల మధ్య కేరళ వంటి మార్కెట్లలో ఉత్సాహం పెరుగుతోంది.
 
షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి... CG పనులు కొనసాగుతున్నాయి. నేపథ్య సంగీతం (RR) పనులు జరుగుతున్నాయి... డబ్బింగ్ మొదలుపెట్టాల్సి ఉంది... దీన్ని ఒక అప్‌డేట్‌గా భావిస్తే, ఇది ఒక అప్‌డేటే. ఒకవేళ కాదనిపిస్తే, అసలైన భారీ విస్ఫోటం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. చాలా, చాలా త్వరలో మరింత అప్ డేట్ ఇస్తామని వెల్లడిస్తుంది చిత్ర టీమ్. ఇప్పటికైనీ మైత్రీ మూవీస్ ఈ సినిమా తెలుగు హక్కులు భారీ మొత్తంలో దక్కించుకుంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Sriram: ఇటీవల కాలంలో నేను చేసిన క్వాలిటీ ఫిలిం ది మేజ్ : శ్రీరామ్