1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actress Sneha kisses a fan, moved by the song.

Actress Sneha: అభిమానిని పాటకు మమేకంతో ముద్దు పెట్టుకున్న నటి స్నేహ

Actress Sneha kisses a fan
Actress Sneha kisses a fan
ఫ్యాన్ సింగింగ్ టాలెంట్ కి స్నేహ ఫిదా అయింది. ఈనెల 12వ తేదీన తన 45 ఏళ్ళ పుట్టినరోజునాడు సింగర్ అయిన  ఓ అభిమాని (సింగర్) తన అద్భుతమైన గాన ప్రతిభతో (సింగింగ్ టాలెంట్) పాట పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. అతని ప్రతిభకు మరియు గాత్రానికి ఎంతగానో ముగ్ధురాలైన నటి స్నేహ, వేదికపైనే అతనిని అభినందిస్తూ అతని బుగ్గపై ముద్దు పెట్టుకుని తన సంతోషాన్ని, ఆశీస్సులను తెలియజేశారు
 
హీరోయిన్‌ స్నేహ (Sneha) పుట్టిన రోజు నేడు (అక్టోబ‌ర్ 12). ఆమె 45వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె భ‌ర్త‌, న‌టుడు ప్ర‌స‌న్న సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ స్పెష‌ల్ ఫోటోల‌ను షేర్ చేశాడు.
 
స్నేహ పుట్టినరోజు సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ప్రసన్న ఇలా రాశారు: "నేను తీసిన నీ ప్రతి ఫోటోలోనూ, అద్భుతమైన వ్యక్తివైన నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం కనిపిస్తాయి! నువ్వు అలసిపోకుండా పని చేయడం, నీ కలలను సాకారం చేసుకోవడం, అత్యంత అంకితభావం కలిగిన తల్లిగా వ్యవహరించడం... ఇవన్నీ చూస్తుంటాను. అదే సమయంలో నాకు మంచి స్నేహితురాలిగా, గొప్ప బలంగా మరియు నాకు ఇష్టమైన ప్రయాణ భాగస్వామిగా ఉండటానికి కూడా నువ్వు సమయం కేటాయిస్తావు"
 
నీ పట్ల నాకున్న అభిమానాన్ని నేను నీకు తగినంతగా చెప్పలేకపోతున్నాను, కన్నమ్మా. నీ ధైర్యం, నీ మంచి మనసు మరియు నువ్వు ప్రేమించే తీరు... ప్రతిరోజూ నీపై కొత్తగా ప్రేమను పెంచుకునేలా చేస్తాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు @realactress_sneha, నా ప్రేమా! ఎన్ని జన్మలైనా సరే... నీ అల్లరి, చిలిపి పనులు, గొడవలు... ఇలా అన్నింటితో సహా నేను నిన్నే ఎంచుకుంటాను." అని పేర్కొన్నారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
పవన్ కళ్యాణ్‌కు 30 యేళ్ళ సినీ ప్రస్థానం : బండ్ల గణేశ్ ట్వీట్