1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Fired once from OpenAI, Sam Altman relates to Jensen Huangs Nvidia exit calls him a hero but says heroes have...

ఎంత పెద్ద స్టార్ అయినా లోపాలు ఉంటాయ్ : శామ్ ఆల్ట్‌మెన్

sam altman
ఎన్విడియా సీఈవోగా జెన్సన్‌ హువాంగ్‌‌ను తిరిగి బాధ్యతల్లోకి తీసుకోవాలని ఇప్పటికే సిలికాన్‌ వ్యాలీలో కీలకమైన టెక్‌ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ బోర్డుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇలా ఒత్తిడి తెచ్చే వారిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పాటు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
జెన్సన్ లేకుండా ఏఐ విప్లవాన్ని, ఎన్విడియాను ఊహించుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఆయనను తాను ఓ హీరోలా భావిస్తానని.. ఎంత పెద్ద హీరోకైనా లోపాలు ఉంటాయని జెన్సన్‌కు మద్దతుగా నిలిచారు. అయితే.. ఆయనను తిరిగి సంస్థలోకి తీసుకు రావాలా?.. వద్దా? అనే విషయం చెప్పడానికి తనకు తగినంత పరిజ్ఞానం లేదని వ్యాఖ్యానించారు.
 
2023లో ఓపెన్ఏఐ నుంచి తనను కొద్దికాలం పాటు తొలగించడాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇటువంటి పరిస్థితిపై తనకు వ్యక్తిగతంగా సానుభూతి ఉందని శామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు. ఆ ఘటన జరిగి ఎంతో కాలమైనా ఆ పరిస్థితులు ఎలా ఉండేవో తనకు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. ఆ సమయంలో పలు కారణాలతో ఓపెన్‌ ఏఐ బోర్డు ఆయనను తొలగించగా.. సిబ్బంది, పెట్టుబడిదారులు ఆల్ట్‌మన్‌కు మద్దతుగా నిలవడంతో కొద్ది రోజులకే తిరిగి సంస్థలోకి తీసుకుంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అక్వాన్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష - కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి...