1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Trump Says Will Become Mr Veto If Republicans Lose US Midterm Election

మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే వీటో అధికారంతో బిల్లులన్నింటినీ తిరస్కరిస్తాను : డోనాల్డ్ ట్రంప్

donald trump
ఒక వేళ మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు మెజార్టీ సాధిస్తే తాను మిస్టర్ వీటోగా మారాల్సి వస్తుందని ఆ సమయంలో వారి అధికారాలాను నియంత్రించేందుకు వీటో పవర్‌ను వినియోగిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో అమెరికా యుద్ధం, ప్రపంచ దేశాలం సంఘర్షణల నేపథ్యంలో స్వదేశంలో డోనాల్డ్ ట్రంప్‌కు తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా మాట్లాడుతూ, ఒకవేళ మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే.. తాను మిస్టర్ వీటోగా మారాల్సి రావచ్చని పేర్కొన్నారు. వారి అధికారాలను నియంత్రించేందుకు వీటో పవర్‌ను వినియోగిస్తానన్నారు. 
 
ఎన్నికల్లో వారు గెలిచి, కాంగ్రెస్‌పై పట్టు సాధిస్తే.. వారు చేసే బిల్లులను ఆమోదించకుండా అన్నింటినీ తిరస్కరిస్తాను. ఒకటి రెండు నెలలపాటు అలా చేస్తే.. చివరికి వారే నా దగ్గరికి వచ్చి ఒప్పందం చేసుకోవాలని చూస్తారు. అయితే.. అవన్నీ వృథా ప్రయత్నాలే అవుతాయి అని ట్రంప్ అన్నారు. 
 
తన పాలనలో చరిత్రలోనే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎదిగిందని పేర్కొన్నారు. రిపబ్లికన్లకు వచ్చే ఓట్లను సర్వేలు సరిగ్గా చూపించట్లేదని అసహనం వ్యక్తం చేశారు. అవకాశం వస్తే మరోసారి అధ్యక్ష స్థానానికి పోటీ చేయడానికీ తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అయితే రాజ్యాంగ నిబంధనలు కఠినంగా ఉండడం వల్ల అది సాధ్యం కాకపోవచ్చని నిరాశ వ్యక్తం చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మురసు తుఫాను ఎఫెక్ట్ .. లోతట్టు ప్రాంతాలను తరలించండి : పవన్ కళ్యాణ్