1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Kurnool : YSRCP ex mla Hafeez Khan warn to TDP leaders

కారుపైకెక్కి.. తొడకొట్టి.. మీసం మెలేసి... మీ అంతు చూస్తానంటూ టీడీపీ కేడర్‌కు వైకాపా మాజీ ఎమ్మెల్యే వార్నింగ్

ycp - tdp flags
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ఆ పార్టీ నేతలు అధికార టీడీపీ కేడర్‌ను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఒకరు కారు పైకెక్కి... మీ అంతు చూస్తానంటూ రెండుసార్లు తొడకొట్టి, మీసం మెలేసి టీడీపీ కార్యకర్తలను బెదిరింపులకు దిగారు. 
 
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత మూడు నాలుగు రోజులుగా వైకాపా నేతలు టీడీపీ నేతలను, కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం మరో అడుగు ముందుకేసి.. వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. 
 
కర్నూలు నగరంలోని 15వ వార్డులో సోమవారం హఫీజ్‌ ఖాన్‌ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. దుర్భాషలాడారు. నడిరోడ్డుపై భయానక వాతావరణం సృష్టించారు. అయన్ను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించినా.. వారిని విడిపించుకొని మరీ.. వేలు చూపిస్తూ టీడీపీ నేతలను రెచ్చగొట్టడంతో పాటు మీ అంతు చూస్తానంటూ బెదిరించారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హోటల్ గదికి వెళ్లిన నవ వధువు.. ఐదు సెకన్లలో మృతి.. ఏం జరిగింది..?