అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’.. ఐఎండీబీ, బుక్ మై షోలలోనూ రికార్డు రేటింగ్స్!
Happy Journey- Balaji Gutta, Kaushik Reddy, Abhiram Naidu and others
కేవలం వ్యూస్ పరంగానే కాకుండా, రేటింగ్స్ విషయంలోనూ హ్యాపీ జర్నీ తన సత్తా చాటుతోంది. ప్రముఖ రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎండీబీ (IMDb)లో ఈ సినిమా ఏకంగా 9.7/10 రేటింగ్ సాధించి ఔరా అనిపించింది. మరోవైపు బుక్ మై షో (BookMyShow)లోనూ 9.5/10 రేటింగ్‌తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఆద్యంతం ఆకట్టుకునే కథనం, సహజమైన నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
గుట్ట ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి, అభిరామ్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. తరుణ్ రెడ్డి, శైలేంద్ర కుమార్, రాజేష్ వ్రజ్లాల్ వసాని, సలోని జయ్ వసాని, అవిషా గోస్వామి తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. సాంకేతిక నిపుణుల పనితీరు కూడా ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. శేఖర్ చంద్ర సంగీతం, మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్ చిత్రానికి మరింత వన్నె తెచ్చాయి. అనిల్ అండ్ భాను, వంశీ శేఖర్ ఈ చిత్రానికి పబ్లిసిటీ బాధ్యతలు నిర్వర్తించగా, జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక మంచి ఫీల్-గుడ్ ఎంటర్టైనర్గా హ్యాపీ జర్నీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో సందడి చేస్తోంది.

