Fauji File No. #25: రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్ పర్సన్ గా శుభాకాంక్షలు చెబుతూ ఫౌజీ పోస్టర్
Fuuzi new poster and Prashanth neel
నిర్మాతలు ఆయన వినయాన్ని, తెరపై ఆయన ఉనికిని ప్రశంసించారు. బాహుబలి బ్లాక్‌బస్టర్‌ల నుండి రాబోయే యాక్షన్ డ్రామాల వరకు, అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన ఆకర్షణను ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. హనురాఘవపూడి.. ప్రభాస్ స్పెషల్ పర్సెన్.. ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా కూడా ప్రశంసలపరంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సోదరి అయిన నీల్ భార్య కూడా ఫ్రభాస్ కు శుభాకాంక్షలు తెలియజేసింది.
ఇదిలా వుండగా, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ చిత్ర బృందం విడుదల చేసిన డీక్లాసిఫైయింగ్ ఫైల్ నంబర్ 25 పేరుతో అతను ఎవరు? అనే ప్రశ్నను తెరపైకి తెచ్చిన చిత్రబృందం, ఈరోజు విడుదల చేయనున్న వీడియోతో ఆ ప్రశ్నకు సమాధానం వెల్లడించనుంది. ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వస్తున్న ఈ ప్రత్యేక వీడియో సినిమాపై అంచనాలను, అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.

