బోయింగ్ విమానం బాడీని కొనుగోలు చేసి ఇంటి వెనుక తోటలో పాతిపెట్టాడు
బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పనికి ఇపుడు ప్రతి ఒక్కరూ విస్తుపోతున్నారు. పాత బోయింగ్ 737 విమానం బాడీని కొనుగోలు చేసి.. ఇంటి వెనక తోటలో పాతిపెట్టాడు. ఈ ఫోటోను ఆ వ్యక్తి ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. యూకేలో వెలుగులోకి వచ్చింది. డెర్బీషైర్‌కు చెందిన ఇంజినీర్ డేవ్ బిల్లింగ్స్ కొన్ని నెలల క్రితం ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టిన బోయింగ్ 737 విమానాన్ని చూశాడు. దాదాపు రూ.5 లక్షలకు దానిని కొనుగోలు చేశాడు. అనంతరం విమానాన్ని ఇంటి వెనుక తోటలో 14 అడుగుల గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టాడు. పై నుంచి కాంక్రీట్‌తో పూర్తిగా మూసివేశాడు.
లోపల విద్యుత్, నీటి సౌకర్యం ఏర్పాటుచేశాడు. విమానంలోని టాయిలెట్‌ను తమ నివాసంలోని సెప్టిక్ ట్యాంక్‌కు అనుసంధానించాడు. ఈ విధంగా ఓ ఇంటికి కావాల్సిన అన్ని సౌకర్యాలతో పాటు లోపలికి వెళ్లడానికి ఓ రహస్య మార్గాన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. అండర్ గ్రౌండ్‌లో పార్టీలు, కుటుంబంతో కలిసి సమయం గడపడం కోసం ఈ వినూత్న ఆలోచన చేసినట్లు డేవ్ బిల్లింగ్స్ వెల్లడించాడు. అంతేకాకుండా ఒకవేళ శత్రు దేశాలు తమపై దాడి చేసినా, మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా దీనిని బంకర్‌గా వాడుకోవచ్చని తెలిపాడు.
???????? Dad BURIES Boeing 737 in backyard to build BUNKER and PARTY PAD The British engineer snapped up the scrapped jet on Facebook for just $5,364 and lowered its 6,000-pound fuselage into a 14-foot-deep pit. The hideout will feature secret tunnels, hidden rooms, and an elevator disguised as a traditional red phone booth. He hopes the bizarre hideaway will double as a spot for below-ground bashes and an emergency shelter capable of keeping his family off-grid for months. Now THATS an underground party! Source: @Tornado_Dave (YT), NYPost / Writer: Marie
— Mario Nawfal (@MarioNawfal) November 10, 2026

