repeat movie review :ఈ నగరానికి ఏమైంది, రిపీట్ చిత్రం ఎందుకు తీశారంటే.. రిపీట్ రివ్యూ
Vishwak Sen, Maganti Srinath, Abhinav Gomatam, Venkatesh Kakumanu
సాంకేతికత: ఛాయాగ్రహణం : ఏజే ఆరోన్, కూర్పు : రవితేజ గిరిజాల, సంగీతం : వివేక్ సాగర్, నిర్మాతలు: సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి, దర్శకత్వం : తరుణ్ భాస్కర్
విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్, మాగంటి శ్రీనాథ్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను వీరంతా ఇప్పటి జనరేషన్ కు తగినవిధంగా సినిమాలలో బిహేవ్ చేస్తుంటారు. దానితో వారికి కనెక్ట్ అవుతాయి. పెద్దగా కథంటూ చెప్పుకోవడానికి మనకు పైకి కనిపించకపోయినా ఏదో చెప్పాలని ట్రై చేస్తుంటారు. అలాంటిదే ఈ నగరానికి ఏమైంది సినిమా. ఎనిమిది సంవత్సరాల నాడు సినిమా తీసి కమర్షియల్‌గా సక్సెస్ అవడమే కాకుండా.. టాలీవుడ్లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా యూత్‌కు హాట్ ఫేవరైట్ అయింది. ఇప్పుడు సీక్వెల్ చేసిన రిపీట్ ఎలా వుందో చూద్దాం.
కథ:
చిన్ననాటి స్నేహితులైన వివేక్ (విశ్వక్ సేన్), కార్తీక్ (మాగంటి శ్రీనాథ్), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు సినిమారంగంలో పేరు తెచ్చుకోవాలని డిసైడ్ అవుతారు. అలా విశ్వక్ దర్శకుడిగా, కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా, కౌశిక్ నటుడిగా ఉపేంద్ర సౌండ్ అండ్ ఎడిటింగ్ వర్క్ చేస్తూ ఓ సినిమా చేస్తారు. నిర్మాత కూడా వీరి స్నేహితుడే. అయితే సినిమా రిలీజ్ నాడు అట్టర్ ఫ్లాప్ అవుతుంది. దానితో నిర్మాత అప్పులుపాలవుతాడు. ఆ అప్పులు తీర్చేందుకు వివేక్ నిర్మాత దగ్గర ఐదేళ్ళు పనిచేస్తాడు.
మరోవైపు కీర్తన (శివాత్మిక) మెడిసిన్ తో తనలాంటి పేరున్న డాక్టర్ ను చేయాలని తండ్రి కోరిక. కానీ తండ్రికి తెలీకుండా సినిమాటోగ్రపీ పిచ్చితో కార్తీక్ దగ్గరే అసిస్టెంట్ గా చేస్తుంది. కీర్తన, ఉపేంద్ర అన్న చెల్లెల్లు. ఇదిలా వుండగా, సినిమా పిచ్చితో తనకు వచ్చిన పెండ్లి సంబంధాలను రిజెక్ట్ చేస్తుంది. అలాంటి టైంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఓ సంబంధాన్ని అంగీకరిస్తుంది. దానితో ఉపేంద్ర తన స్నేహితులందరినీ పిలిచి కాబోయే బావగారితో పార్టీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ క్రమంలో జరిగిన సంఘటన నేపథ్యంతో కీర్తన పెండ్లిని ఢిల్లీ బాబు కాన్సిల్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఏమయింది. పార్టీలో అసలు ఏం జరిగింది? అనంతరం స్నేహితులంతా కలిసి కీర్తన కోసం ఏం చేశారు? అనేది మిగిలిన కథ.
సమీక్ష:
ట్రైలర్ లో చూపించినట్లుగా విశ్వక్ సేన్... ఆడియన్స్ ను పిచ్చెక్కిసే కథ అంటాడు. సినిమా మొత్తం అలానే వుంటుంది. తెలంగాణాకు చెందిన నటులు కావడంతో వారి యాస, బాష, యారగెంట్ అన్నీ వారికి సరిపోయాయి. సమాజంలో సినిమా అంటే చాలా చులనకన భావం వుంది. దానిని మైండ్ లోంచి తీసేయాలని స్నేహితులంతా కలిసి సినిమా చేశారు. అది అభినందనీయమే. అందుకే తమకు తోచిన శైలిలో వారు సినిమా తీశారు. ఇందుకు సినిమాటిక్ ఫ్రీడమ్ అనేది తీసుకున్నారు.
ముఖ్యంగా సినిమా రంగంలో వుండే పోకడలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. మేనేజర్ వ్యవస్థ, ఇన్ఫ్యూయనర్రస్ ప్రమోషన్, ఆర్టిస్టు బాగా చేశాక కూడా మరోసారి చేయమంటే నిర్మాతను మరింత డబ్బులు అడగడం, దర్శకుడు రిపీట్ సీన్ మరలా చేయమంటే.. డబ్బింగ్ లో చూసుకోమనడం వంటివన్నీ బయటవారికి తెలియచెప్పారు. హీరోయిన్ గా నటించడమంటే ఓ ఆలోచనతో చూస్తారు. దానిని కూడా సున్నితంగా చెప్పడం విశేషం.
ఇలా ఇందులో నటించిన వారంతా నటించారనేకంటే బిహేవ్ చేశారనడం ఉత్తమం. కథకుడిగా యారెగెటంట్ వుండే ప్రవర్తనతో దర్శకుడి ఎలా వుంటాడనే విశ్వక్ సేన్ పాత్రతో చూపించేశాడు తరుణ్ భాస్కర్. అందుకే అతన్ని సైకో గా అంటూ స్నేహితులు పిలవడం బాగుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి తన రైటింగ్ తో ఆకట్టుకున్నారు. బలమైన నాలుగు పాత్రల్ని రాసి, వాటి చుట్టూ సినిమాను నడపడానికి సరిపడే రీతిలో కథనాన్ని అల్లుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా ప్రధాన పాత్రలు, వాటి మాటలు ట్రెండీగా ఉండటంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ముందుగా చెప్పుకోవాలంటే,
గోమటం పాత్ర క్లయిమాక్స్ లో అడవిలో ఎలుగుబంటితో జరిగే సన్నివేశాలు వినోదాత్మక సన్నివేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ బాగానే నటించాడు. ఉప్పి పాత్రలో వెంకటేష్ కాకుమాను మంచి నటనను కనబరిచాడు. మాగంటి శ్రీనాధ్ నటన కూడా బాగుంది. శివాత్మిక రాజశేఖర్ తన నటనతో మంచి ముద్ర వేయగా, ప్రియదర్శిని రామ్ మరియు రాబిన్ పాత్రలో మహేష్ చింతల తమ పాత్రలలో చక్కగా నటించారు.
ఈ చిత్రం కూడా పార్ట్ వన్ శైలినే అనుసరిస్తుంది, అయితే ఇది భిన్నమైన నేపథ్యంలో సాగుతుంది. అదే నలుగురు స్నేహితులు మరోసారి ఇబ్బందుల్లో పడి, తమను తాము నిరూపించుకోవడానికి ఒక సినిమా తీయాల్సిన సవాలును ఎదుర్కొంటారు. కథాంశం హాస్యానికి ఆస్కారం కల్పించినప్పటికీ, ఈ సీక్వెల్లో కొత్తదనం కొరవడింది,
ఈ సినిమాలో కొత్తగా వినిపించే పదం రిబీట్.. అంటే రాయితీ. విదేశాల్లో కొన్ని చోట్ల షూటింగ్ చేస్తే రాయితీలు వుంటాయి. అంటే పెట్టిన డబ్బు కూడా తిరిగి వస్తుందన్నమాట. ఈ విషయం చాలా మందికి తెలీదు. అందేకు చాలా సినిమాలు విదేశాల్లో ఇంతవరకుు ఎవరూ తీయని లొకేషన్లలో తీశామంటూ ప్రచారంలో చాలా మంది దర్శక నిర్మాతలు హీరోలు చెబుతుంటారు ఇందుకేనేమో అనిపిస్తుంది.
ఇక, కెమెరామెన్ ఏజే ఆరోన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కామెడీ అండ్ కీలక సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం సరికొత్తగా అనిపిస్తుంది. ఎడిటర్ రవితేజ గిరిజాల వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాతలు సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.కొత్త సినిమా వార్తలు
టోటల్ గా చూస్తే, ఇప్పటి జన్ జీ బ్యాచ్ కు కనెక్ట్ అయ్యే విధంగా సినిమా వుంటుంది. రొటీన్ పార్మెట్ లో కాకుండా తమ శైలిలో సినిమా తీసి మెప్పించే ప్రయత్నం చేశారు. సురేష్ బాబు వంటి వారు కూడా ఈతరం సినిమా అని అందులోనూ సినిమా రంగంపై గౌరవం తెచ్చే సినిమా కావడంతో ఆయన రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు.
రేటింగ్ : 2.75/5

