1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Trivikram Srinivas provides an update on the NTR film

NTR & Trivikram :ఎన్.టి.ఆర్. సినిమాపై అప్ డేట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR & Trivikram film poster
NTR & Trivikram film poster
ఎన్.టి.ఆర్. తో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా వుంటుందన్న విషయం తెలిసిందే. చాలా కాలం గేప్ తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజా తన రాబోయే సినిమా గురించి అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం వెంకటేష్ తో చేసిన ఆదర్శకుటుంబం.. హౌస్ నెం. 47 చిత్రం ఈనెల 30న విడుదల కాబోతోంది.
 
 
ఈ సందర్బంగా దర్శకుడు ఓ ఓటీటీ తలపెట్టిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్‌ 2 ప్రోమోలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతసంతరించుకున్నాయి.
 
దర్శకుడు తెరకెక్కించనున్న భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం గాడ్ ఆఫ్ వార్ అనే పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమా కథ పూర్తయిందని గతంలోనే త్రివిక్రమ్ వెల్లడించారు. ఇప్పుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో ఆదర్శకుటుంుబం టీమ్ పాల్గొన్నారు. 
 
ప్రమోషన్స్‌లో భాగంగా త్రివిక్రమ్‌, సంగీత దర్శకుడు తమన్‌, నటుడు సునీల్‌ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు.. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ చేయబోయే సినిమాను ప్రస్తావించారు.
 
దీనికి త్రివిక్రమ్‌ బదులిస్తూ,  తన మనసులో ఆరు ముఖాలు కలిగిన ఒక బొమ్మ రాగానే మాటలు వాటంతట అవే వచ్చాయని, బహుశా అది దైవ సంకల్పమేనని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ చేస్తున్నప్పుడు త్రివిక్రమ్‌ పైకి చూస్తూ ఓ లుక్ ఇచ్చారు. ఆ కళ్ళలో కాన్ఫిడెన్స్ చూస్తే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ.
 
ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ తెరకెక్కించనున్న ఈ పౌరాణిక చిత్రం కార్తికేయ స్వామి నేపథ్యంలో రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ పూర్తయిందని త్రివిక్రమ్‌ స్పష్టం చేశారు. అయితే ‘గాడ్ ఆఫ్ వార్’ అనేది అధికారిక టైటిల్‌ కాదు. ఇటీవల నిర్మాత నాగవంశీ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. సినిమా టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని తెలిపారు.
 
అరవింద సమేత వీర రాఘవ తర్వాత వీరి కలయికలో రానున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తినెలకొంది. ఇక తాజాగా ఎన్టీఆర్‌.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు పూర్తయ్యాక త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించే అవకాశం ఉంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ సెరిట్ ఇకలేరు