చిన్నప్పుడు మా మావయ్య ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు: నటి శివాంగి
నటి శివాంగి జోషి తనకు చిన్నప్పుడు ఎదురైన లైంగిక వేధింపులను లాకప్ 2 వేదికగా పంచుకున్నది. తన చిన్నతనంలో తనకు మావయ్య వరస అయ్యే దగ్గర బంధువే తనపై లైంగిక దాడికి యత్నించాడని ఆమె వెల్లడించారు.
శివాంగి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ... నాకు మావయ్య వరసయ్యే వ్యక్తి రోజూ స్కూల్ నుంచి ఇంటికి తీసుకుని వచ్చేవాడు. అతడంటే మా అమ్మకు ఎంతో నమ్మకం వుండేది. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న అతడు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తుండేవాడు.
సినిమాల్లో నటించాలంటే డ్రైవింగ్ నేర్చుకోవాలనీ, ఇంకా ఏవేవో చేయాల్సి వుంటుందని తన ఒడిలో కూర్చుబెట్టుకుని అసభ్యంగా తాకుతుండేవాడు. నా తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు నాపై లైంగిక దాడికి యత్నించాడు. ఈవిషయం తెలుసుకున్న అమ్మానాన్నలు అతడిని బైటకు గెంటేసారు అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
