ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య, ఇద్దరూ కలిసి పరార్
ఆరు నెలల క్రితమే పెళ్లయ్యింది. పెళ్లయిన దగ్గర్నుంచి భార్య ప్రవర్తనలో ఏదో తేడా వున్నట్లు గమనించాడు భర్త. దీనిపై నిలదీయడం ప్రారంభించాడు. అదే అతడి అంతానికి కారణమైంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక లోని విజయపుర జిల్లా ముద్దెబిహాల్ తాలూకాలోని రుదాగి గ్రామంలో 27 ఏళ్ల వ్యక్తి తన ఇంటిలోనే శవమై కనిపించాడు. అతడు గొంతు కోసి హతమార్చినట్లు కనబడింది.
మృతుడు రుదాగి గ్రామానికి చెందిన గణేష్ గా గుర్తించారు. ఇతడికి అక్షత అనే యువతితో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం అయితే చేసుకున్నది కానీ తన ప్రియుడిని మాత్రం వదల్లేకపోయింది. అతడితో తరచూ ఫోన్ సంభాషణలతో పాటు ఏకాంతంగా కలవడం కూడా చేస్తున్నది. దీనితో అక్షత భర్త ఆమెను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు.
అంతే... ప్రియుడిని పిలిపించి అర్థరాత్రి వేళ భర్తను హత్య చేసింది. అనంతరం ఇద్దరూ కలిసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన ఆ ఇద్దరి కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

