1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Nvidia CEO Jensen Huang resigns amid spy scandal

నిన్నటి వరకు బిలియనీరు.... ఇపుడు పరువు కోల్పోయి దారుణ స్థితికి దిగజారిపోయారు...

Jensen Huang
రెండు వారాల ముందు వరకు.. కృత్రిమ మేధ ప్రతినిధిగా ప్రపంచవ్యాప్తంగా వెలుగొందిన బిలియనీర్‌ జెన్సన్‌ హువాంగ్‌ చైనాకు చెందిన గూఢచారిణితో వివాహేతర బంధం కొనసాగించి ఇప్పుడు పరువు కోల్పోయి దారుణమైన పరిస్థితికి దిగజారారు. తొలుత ఈ ఆరోపణలను తిప్పికొడుతూ వచ్చిన ఆయన.. చివరకు మరోదారి లేక భేషరతుగా లొంగిపోయారు. 
 
ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో హువాంగ్‌ తీవ్రంగా కుమిలిపోయినట్లు తెలుస్తోంది. తానో చెత్త వ్యక్తినంటూ నిందించుకున్నారట. ఈ మేరకు ఎన్విడియా విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
 
'ఎన్విడియా అభివృద్ధి కోసం హువాంగ్‌ కొన్ని దశాబ్దాల పాటు కృషి చేశారు. చిప్‌ ఆర్కిటెక్చర్‌ నుంచి జూనియర్‌ స్థాయి ఉద్యోగుల వేతనాల వరకూ ప్రతి చిన్న విషయాన్నీ ఆయన నిశితంగా పరిశీలించేవారు. కానీ, ఇప్పుడు ఈ వివాదం బయటపడటంతో అందరి ముందు చేతులెత్తేసి దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. 
 
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన ఆయన.. చేసేదేం లేక రాజీనామా చేసినట్లుగా కన్పించింది. రాజీనామా సమయంలో సమావేశ గదిలో హువాంగ్‌ ప్రవర్తన ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇటీవలి కాలంలో ‘ఏదైనా కానీ’.. ‘నాకేం పట్టదు.. సంబంధం లేదు’ అంటూ వచ్చిన ఆయన.. చివరకు ‘నేనో పనికిమాలిన వ్యక్తిని’ అని తనను తాను నిందించుకునే పరిస్థితికి వచ్చారు’’ అని సదరు కంపెనీ వర్గాలు వివరించాయి. అలాగే, ఈ వివాదంతో ఆయన సంపద విలువ 154 బిలియన్‌ డాలర్ల నుంచి 139 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నవ్యాంధ్ర అభివృద్ధిలో పోర్టులే కీలక పాత్ర : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ