Varanasi first single :వారణాసి నుంచి దించుదించు. అనే ఫస్ట్ సింగిల్ రాబోతోంది
Updated: Sat, 28 Nov 2026 (10:58 IST)
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'వారణాసి' షూటింగ్ పూర్తి చేసుకుని భారీ సీజీఐ, పోస్ట్-ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. దీంతో, ఏప్రిల్ 7, 2027న జరగాల్సిన ఈ చిత్రం అప్పుడే విడుదలవుతుందని చిత్ర నిర్మాత సంస్థ దుర్గా ఆర్ట్స్ కూడా పోస్టర్ విడుదల చేసింది. అయితే నిన్న ఓ వేడుకలో పాల్గొన్న రాజమౌళిని దుల్కర్ సల్మాన్ వారణాసి గురించి అడుగగా సింపుల్ గా త్వరలో అంటూ చెప్పడంతో రిలీఫ్ ఇచ్చారు.
అనుకున్నట్లే నేడు సోషల్ మీడియాలో వారణాసి నుంచి దించుదించు. అనే ఫస్ట్ సింగిల్ డిసెంబర్ లో రాబోతోందంటూ ఓ కొత్త పోస్టర్ విడుదలైంది. దానితో రాజమౌళి చాలా క్లారిటీతో వున్నారనీ, కొందరు లేనిపోని వార్తలు రాస్తూ అంతకుమించి పబ్లిసిటీ చేస్తున్నారని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఈ చిత్ర కథ రీత్యా మహేష్ బాబు రెండు పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. రుద్ర అనే పాత్రతో మొదలయి మరో పాత్రతో ఎండ్ అవుతుందని ఆప్రికా, అంటార్కికా ప్రాంతాలలోనూ ఈ చిత్రాన్ని షూట్ చేశారు. ఈ చిత్రంలో మస్తానా దేవి అనే అమ్మవారి రూపం తలలేకుండా చేతితో పట్టుకున్నట్లుగా వుంటుంది. ఇది చిత్రానికి పెద్ద ప్రాధాన్యత వుంటుందని తెలుస్తోంది.
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి