1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Puja ceremony held for Action King Arjun's film at the Shri Ram Janmabhoomi in Ayodhya

Action King Arjun: శ్రీరామ జ‌న్మ‌భూమి అయోధ్య‌లో యాక్షన్ కింగ్ అర్జున్ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు

Action King Arjun Sarja, Anoop Mohan
Action King Arjun Sarja, Anoop Mohan
యాక్ష‌న్ కింగ్ అర్జున్ సర్జా ప్ర‌ధాన పాత్ర‌లో ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌పై అనూప్ మోహ‌న్ నిర్మాత‌గా భారీ బ‌డ్జెట్‌తో దేశ‌భ‌క్తి సినిమా రూపొంద‌నుంది. ఈ ప్రెస్టీజియ‌స్ మూవీ న‌వంబ‌ర్ 27న శ్రీరామ జ‌న్మ‌భూమి అయోధ్య‌లో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకోనుంది. అదే రోజున టైటిల్‌ను కూడా అనౌన్స్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
 
అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా రూపొందనున్న ఈ దేశ‌భ‌క్తి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ జన్మభూమి అయోధ్య‌ ఆలయంలో సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా నిలవనుందని టీమ్ వెల్ల‌డించింది. అర్జున్ స‌ర్జా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో పాటు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను కూడా నిర్వ‌హించ‌నున్నారు.
 
బాలీవుడ్‌తో పాటు వివిధ ప్రాంతీయ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగస్వాములు కానున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలోని పలువురు ప్రముఖులతో కూడిన భారీ పాన్ ఇండియా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది.అనూప్ మోహ‌న్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి జోస్ ఎం. థామస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
 
బలమైన కథాంశం, ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా దేశభక్తి, ధైర్యసాహసాలు, త్యాగం, భారతదేశ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్నారు. ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌లో రూపొంద‌నున్న మూడ‌వ ప్రెస్టీజియ‌స్ మూవీ ఇది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
దక్షిణ కొరియాకు చెందిన హ్యేయిన్ కిమ్‌తో గల్లా జయదేవ్ చిన్న కుమారుడి పెళ్లి