1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. A song featuring Suriya and Nazriya Nazim, set against a video game concept, appears in the movie Scene

Suriya: వీడియో గేమ్ కాన్సెప్ట్ తో సీన్ చిత్రంలో సూర్య, నజ్రియా నజీమ్‌ పై సాంగ్

Suriya and Nazriya Nazim
Suriya and Nazriya Nazim
హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసి సినిమాలోని క్విర్కీ, ఎంటర్‌టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేశారు.
 
ఇప్పుడు మ్యూజికల్ జర్నీని ఫస్ట్ సింగిల్ ‘అమ్మో ఇది ఎవర్రా’తో ప్రారంభించారు. సుశిన్ శ్యామ్ కంపోజ్ చేసిన ఈ పాట ఫుట్‌ట్యాపింగ్ బీట్స్, వెంటనే ఆకట్టుకునే రిథమ్‌తో అదిరిపోయే ఎనర్జీని అందిస్తోంది. పాటలోని వైబ్రెంట్ మూడ్‌కు తగ్గట్టుగా ఈ అప్‌బీట్ కంపోజిషన్ ఆకట్టుకుంది. రాకేందు మౌళి అందించిన లిరిక్స్ నజ్రియా నజీమ్ పాత్రలోని అగ్రెసివ్, ఎనర్జిటిక్ నేచర్‌ను ప్రజెంట్ చ్ర్స్తునాయి. సింగర్ వినాయక్ తన లైవ్లీ, ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత ఎనర్జీతీసుకొచ్చారు.
 
వీడియో గేమ్ కాన్సెప్ట్ చుట్టూ ఈ పాటను క్రియేటివ్‌గా డిజైన్ చేశారు. కొరియోగ్రాఫర్ రాజ్ ప్రియన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ యూనిక్ ఐడియా పాటకు ప్లేఫుల్ టచ్‌ను తీసుకొచ్చింది. ఫన్, క్విర్కీ ఎలిమెంట్స్‌తో పాటను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా నజ్రియా నజీమ్ పాటంతా ఫుల్ ఎనర్జీ, ఉత్సాహంతో కనిపించారు. ‘అమ్మో ఇది ఎవ్వర్రా’ పాట అదిరిపోయేలా ఉండటంతో ‘సీన్’ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు ఇది మంచి ఆరంభంగా నిలిచింది.
 
వినీత్ అగస్టిన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సుశిన్ శ్యామ్ సంగీతం సమకూరుస్తున్నారు. అజ్మల్ సాబు ఎడిటింగ్, అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైన్‌.
‘సీన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Rahul Sankrityan: తను దేవుళ్లతో మాట్లాడుతాడు, రాక్షసులను ఎదుర్కొంటాడు.. అతనే రణబాలి : రాహుల్ సంకృత్యన్