1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Is it true that actress Anita fell into a cyber trap involving a flight ticket?

actress Anita : విమాన టికెట్ పేరిట సినీ నటి అనితకు సైబర్ వల నిజమేనా?

Anitha Chowdari
Anitha Chowdari
బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేస్తామని చెప్పి సీనియర్ నటి అనిత నుంచి  సైబర్ నేరగాళ్లు రూ.4.14 లక్షలు కాజేసినట్లు సోషల్ మీడియా వర్త వినిపిస్తోంది. మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివాసం ఉంటూ, అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉండే తన కొడుకు పుట్టినరోజు వేడుకల కోసం విమాన టికెట్ బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెంట్ కోసం వెతికిన సినీ నటి గోగినేని అనిత చౌదరి.
 
లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్  సంస్థ పేరిట ఆమెను సంప్రదించి, బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.4,14,180 ఉంటుందని, డెబిట్ కార్డు వివరాలు చెప్పాలని కోరిన రాజేష్ అనే ఏజెంట్. డెబిట్ కార్డు వివరాలు ఇచ్చి, టికెట్ బుకింగ్ కోసం అని నమ్మి ఓటీపీ కూడా చెప్పిన అనిత
 
దీంతో అకౌంట్ నుంచి క్లియర్ ట్రిప్ పేరిట డబ్బులు కట్ అయ్యాక కూడా టికెట్ బుకింగ్ వివరాలు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. మంగళవారంనాడు సైబర్ పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నారు. ఇదిలా వుండగా, ఇటీవలే అమెరికా  నేపథ్యంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందుకు సంబంధించి షూట్ కూడా అక్కడ వుండనుంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
chiranjeevi: ఇట్లు అర్జున లోని కొత్త హీరో అనీష్‌ కు అగ్రహీరోలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ?