Prabhas in a police uniform: ప్రభాస్ పోలీస్ యూనిఫాం కథ గురించి చెప్పిన సందీప్ రెడ్డి
సందీప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా స్పిరిట్. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడు. ఈ సినిమాలో పోలీస్ యూనిఫాం లో కనిపిస్తాడు. దీనిపై బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో ఇలా అన్నారు: "నాకు చాలా పోలీస్ కథలు వచ్చాయి, కానీ అవి నాకు సరిపోవనిపించి నేను అంగీకరించలేదు."
ఇప్పుడు, మీ కథ విన్న తర్వాత, నేను పోలీస్ యూనిఫాం ధరించాలని నిర్ణయించుకున్నాను. మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది పోలీస్ పాత్రలు పోషించారు, కానీ నేను ఒక ప్రత్యేకమైన కథ కోసం ఎదురుచూస్తున్నాను.
నేను పోలీస్ యూనిఫాం ధరిస్తున్నానంటే, అందులో ఒక ప్రత్యేక శైలి ఉండాలి; దానికి ఒక గొప్ప దర్శకుడు కావాలి, అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను.
ఒక విషయం చెబుతాను బ్రో... థియేటర్లలో ప్రభాస్ అన్న పోలీస్ యూనిఫామ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పుడు, అభిమానులు చేసే రచ్చ ఎలా ఉంటుందో, వారు చూడబోయే ఆ 'స్వాగ్' (స్టైల్) ఎలా ఉంటుందో చూడాలని నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. అన్నారు.

