1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kiara Advani shares emotional account of her first three months of pregnancy

గర్భం దాల్చిన తొలి మూడు నెలలు చాలా కష్టంగా ఉంటుంది : కియారా అద్వానీ

kiara advani
బాలీవుడ్ నటి కియారా అద్వానీ తన తొలి ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. గర్భం దాల్చిన తొలి మూడు నెలలు చాలా కష్టంగా గడిచాయని, ఆ సమయంలో తన జీవితంలోని మహిళల మద్దతు ఎంతగానో కోరుకున్నానని గుర్తుచేసుకుంది. ప్రస్తుతం రెండోసారి గర్భవతిగా ఉన్న కియారా, గతంలో కరణ్ జోబార్ వ్యాఖ్యాతగా వ్యవహరించే కాఫీ విత్ కరణ్ షోలో ఈ వ్యాఖ్యలు చేసింది. 
 
తొలి ప్రెగ్నెన్సీ అనుభవాలను వివరిస్తూ 'ఆ మొదటి మూడు నెలలు చాలా కఠినంగా గడిచాయి. వికారం, హార్మోన్ల మార్పులతో తీవ్రంగా ఇబ్బందిపడ్డాను. మొదట్లో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని నేను, నా భర్త సిద్ధార్థ్ అనుకున్నాం. కానీ, నాకు అప్పుడు మహిళల సపోర్ట్ అవసరమనిపించింది. వెంటనే సిద్ధార్థ్ చెప్పాను.. 'లేదు సిద్, నేను మా అమ్మతో, అత్తగారితో మాట్లాడాలి. నన్ను అర్థం చేసుకునే మహిళలు నా జీవితంలో ఇప్పుడు కావాలి' అని అన్నాను' అని కియారా తెలిపింది.
 
ఆ క్లిష్ట సమయంలో తన స్నేహితురాళ్లతో కలిసి కూర్చుని ఏడ్చేదానినని, వారు తనను ఓదార్చారని కియారా గుర్తుచేసుకుంది. మహిళల మధ్య ఉండే ఆ బంధం, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని ఆమె వివరించింది.
 
కాగా, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు ఈ ఏడాది మొదట్లో పాప (సారాయా) జన్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే, అక్టోబరు 7న తాము రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 
 
తమ కూతురు సారాయా చేతిలో చిన్నారి సాక్స్ ఉన్న ఫొటోను పంచుకుంటూ "మరోసారి దేవుడి గొప్ప బహుమతితో ఆశీర్వదించబడ్డాం. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి" అని పోస్టులో చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Pawan Kalyan, Dil Raju :బాలక్రిష్ణ పై త్వరలో క్లారిటీ ఇస్తా : పవన్ కళ్యాణ్ తో సినిమా వుంటుంది : దిల్ రాజు-