Venkatesh: ప్యాచ్ వర్క్ షూట్ లో ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK47’ చిత్రం
Aadarsha Kutumbam song
ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ, దసరా పండుగ సెలవులకు మరింత దగ్గరగా ఉండేలా అక్టోబర్ 9న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మొదట అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించినప్పటికీ ప్రేక్షకుల వెసులుబాటు వుండేలా చూసుకున్నట్లు తెలిసినా, ఈ సినిమాలో కొంత భాగం షూట్ మిగిలిన వుందని సమాచారం. హైదరాబాద్ శివార్లో గుంటూరు కారం సెట్లో షూటింగ్ జరుపుతున్నారు.
ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. దాదాపు 20 ఏళ్ళ తర్వాత త్రివిక్రమ్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు క్లాసిక్ లవ్ స్టోరీలు. అలాంటి సినిమాల తర్వాత ఇప్పుడు త్రివిక్రమ్ మరో అద్భుతమైన కథను తీసుకొచ్చారు. ఇందులో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. మీరు ఊహించని ట్విస్టులు ఉంటాయి. సినిమా చూసి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆదర్శ కుటుంబం.. ఇది మామూలు కుటుంబం కాదు. వేరే లెవెల్. త్రివిక్రమ్ సినిమాని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. తమన్ అద్భుతమైన పాటలు అందించారు. చినబాబు గారు, నాగవంశీ మంచి మనుషులు. వారి బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది." అన్నారు.
