అమితాబ్‌కు ప్రాణభయం - తొలిసారి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ స్క్రీన్‌లో ఫ్యాన్స్‌కు అభివాదం
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముఠా సభ్యుల హెచ్చరికల నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత భద్రతను మరింతగా పెంచుకున్నారు. ప్రతి ఆదివారం ముంబైలోని తన నివాసం జల్సా వెలుపల అభిమానులకు అభివాదం చేయడం ఆయన ఆనవాయితీ. దీంతో నవంబరు ఒకటో తేదీ అయిన ఆదివారం ఆయన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ స్క్రీన్ వెనుక నుంచి కనిపించారు. ఆయన నివాసానికి బాంబు బెదిరింపులు రావడం, నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు స్పష్టమవుతోంది.
అక్టోబరు 23వ తేదీన ముంబై మేయర్‌కు అందిన ఒక ఈ-మెయిల్లో అమితాబ్ నివాసం జల్సాపై దాడి చేస్తామని దుండగులు హెచ్చరించారు. అక్టోబరు 31 నుంచి నవంబర్ 27 మధ్య ఈ దాడి జరగవచ్చని పేర్కొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనికి తోడు, రెండు వారాల క్రితం జుహూ ప్రాంతంలోనే నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ప్రాఫ్ సురక్షితంగా బయటపడినప్పటికీ, బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేగింది. ఈ దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది.
టైగర్ ప్రాఫ్ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు, పర్యాటకుల ముసుగులో అమితాబ్ బచ్చన్‌తో పాటు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర నటుల ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించినట్లు తేలింది. బాలీవుడ్‌లో భయాందోళనలు సృష్టించి, తమ ఉనికిని చాటుకోవడమే వారి లక్ష్యమని పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు 12 మందిని అరెస్టు చేశారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో అమితాబ్ తన భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకున్నారు.
Although #AmitabhBachchan no longer speaks about major national issues through his tweets, today he made the whole world realize that actors are no longer safe in Mumbai. Now, where are those people who used to share photos of Manmohan Singh at the Red Fort, standing behind a bulletproof shield? @SrBachchan https://t.co/7E1U27oMha
— Shikhar Negi (@ImshikharNegi) November 1, 2026

