1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Vijay Antony's wife discloses why the actor refuses to wear footwear anymore!

చెప్పులు ధరించనని భీష్మ ప్రతిజ్ఞ చేసిన కోలీవుడ్ హీరో ఎవరు?

vijay antony
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ చెప్పులు ధరించడం మానేశారు. దీని వెనుక బలమైన కారణం ఉంది. విజయ్ ఆంటోనీ-ఫాతివా విజయ్ ఆంటోనీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మీరా ప్లస్ టూ చదువుకుంటూ ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి నుంచి విజయ్ ఆంటోనీ దంపతులు తీవ్ర విషాదంలో కూరుకునిపోయారు. అయితే, మీరా ఉపయోగించిన వస్తువులు ఇప్పటికీ వారు జ్ఞాపకాలుగా దాచుకున్నారు. ఈ క్రమంలో మీరాకు కొనిచ్చిన చెప్పులు కూడా గదిలోనే ఉన్నాయి. ఆ చెప్పులను చూసిన  విజయ్ ఆంటోనీ ఇక జీవితంలో చెప్పులు ధరించకూడదని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి నడుచుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య ఫాతిమా విజయ్ ఆంటోనీ వెల్లడించారు. 
 
విజయ్ ఆంటోనీ తాజా నటించిన చిత్రం అప్పుకుట్టి. ఈ నెల 20వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ తాజాగా నగరంలో జరిగింది. ఇందులో ఫాతిమా విజయ్ ఆటోనీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ కుమార్తె మీరా ఉపయోగించిన వస్తువులు ఆమె గదిలో నేటికీ జ్ఞాపకాలుగా కాపాడుకుంటున్నామని తెలిపారు. మీరా కోసం కొనుగోలు చేసిన చెప్పులను చూసి ఇకపై జీవితంలో చెప్పులు ధరించకూడదని విజయ్‌ ఆంటోని నిర్ణయించారని పేర్కొన్నారు. మీరా కొనిచ్చిన సుమారు రూ.4 వేల విలువైన చేతి గడియారాన్ని మాత్రమే ధరిస్తున్నారని, ఇందుకోసం గతంలో వాడిన ఖరీదైన చేతి గడియారాన్ని పక్కనపెట్టారని తెలిపారు.
 
హీరో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ... సినిమాలో ప్రీతి అస్రాని పోషించిన పాత్ర అత్యంత సవాలుతో కూడుకుందని తెలిపారు. చిత్రంలో తండ్రి, కుమార్తె మధ్య అనుబంధాన్ని చాలా గాఢంగా చెప్పామన్నారు. కార్యక్రమంలో నిర్మాతలు ధనుంజయన్, చిత్రా లక్ష్మణన్, దర్శకులు నిథిలన్‌ సామినాథన్, మందిరమూర్తి, నటులు నటరాజన్, భగ్స్‌ అలియాస్‌ భగవతి పెరుమాళ్, మూణారు రమేశ్, లిస్సీ ఆంటోని, మురుగానందం, దర్శకులు శశి, మోహన్‌రాజా, సుశీంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Allu Arjun: రెండు లక్షల మందితో పాట్నాలో పుష్ప 2’ కార్యక్రమానికి రెండేళ్లు