1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. WhatsApp officially rolls out Always Mute option for groups chats

వాట్సాప్ నుంచి కీలక ఫీచర్.. ఆల్వేస్ మ్యూట్.. గ్రూప్ చాట్‌లతో విసిగిపోయారంటే?

WhatsApp
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ నుంచి కీలక ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. గ్రూపు చాట్స్, అలర్ట్స్‌తో విసిగిపోయిన యూజర్లుకు కొత్త అప్ డేట్ అందించింది. వాట్సాప్‌లోని గ్రూప్ చాట్‌లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్‌తో ఎప్పటికీ మ్యూట్  చేసే ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక ట్విటర్‌లో వెల్లడించింది. చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చని ట్వీట్ చేసింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా ఇది అందుబాటులో ఉంది. 
 
చాట్‌ను మ్యూట్ చేస్తే సంబంధిత గ్రూపులనుంచి నోటిఫికేషన్ రాదు. సందేశాలు, చిత్రాలు లేదా వీడియోలు, ఇతర ఏ ఫీడ్‌ ఇబ్బంది పెట్టదు. అంతేకాదు. అవసరమైతే దీన్ని అన్‌మ్యూటింగ్  అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు ఈ సదుపాయం ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక సంవత్సరం పాటు మ్యూట్ చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రొత్త ఫీచర్ ప్రజలు ఆ ఇబ్బందికరమైన వాట్సాప్ గ్రూపులనుంచి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. 
తర్వాతి కథనం
దసరా సందర్భంగా పల్లెవైపు ప్రయాణమౌతున్న భాగ్యనగర వాసులు