పరాయి పురుషుడితో ఆ మాటలేంటి? అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
బెంగుళూరులో ఓ దారుణం జరిగింది. పరాయి పురుషుడుతో తన భార్య సన్నిహితంగా ఉంటోందని అనుమానించి భర్త ఆమెను కడతేర్చాడు. మొబైల్ ఫోనులో పరాయి పురుషుడుతో ఆ మాటలేంటి అంటూ భార్యను ప్రశ్నించడంతో మొదలైన ఘర్షణ చివరకు భార్య హత్యకు దారితీసింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ నుంచి రుక్సానా, ఇర్ఫరాజ్ అనే దంపతులు నగరానికి బెంగుళూరు నగరానికి వలస వచ్చారు. ఆమెకు ఆదివరకే వివాహమై, భార్యకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇర్ఫాజ్‌తో పరిచయం ఏర్పడింది. చివరకు ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ యేడాది క్రితం వివాహం వరకు దారితీసింది.
ఈ క్రమంలో వీరిద్దరూ ఉపాధి కోసం ఆరు నెలల కిందట నగరానికి చేరుకుని ఓ గార్మెంట్ సంస్థలో పనికి చేరారు. ఆమె తరచుగూ వేరొకరితో మొబైల్ ఫోనులో మాట్లాడటాన్ని ఇర్ఫరాజ్ భరించలేకపోయాడు. ఆ అసహనం ఆగ్రహానికి దారితీసింది. ఇద్దరి మధ్య గొడవలు రగిలాయి. ఈ నెల 13వ తేదీన ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఆమెపై కోపం పట్టలేక ఇర్ఫరాజ్ చేతికందిన బండరాయి నెత్తిన వేయగా రుక్సానా తల పగిలిపోయింది. ఆ తర్వాత ఆమె చనిపోయేంత వరకు గొంతు నులిమేసి, మృతదేహాన్ని ద్విచక్రహనంపై పెట్టుకుని చీకట్లోనే రాజకాలువలో పడేసి పరారయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దుస్తులు, నగల ఆధారంగా ఆమెను గుర్తించి నిందితుడిని కూడా అరెస్టు చేశారు.

