1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Siddu’s love story will be one that captivates everyone – Director Ramesh Babu

అందరినీ ఆకట్టుకునేలా సిద్ధుగాడి లవ్ స్టోరీ వుంటుంది - డైరెక్టర్ రమేష్ బాబు

Ramesh Babu; Manoj, Shruti, Mohana Siddhi and others
Ramesh Babu; Manoj, Shruti, Mohana Siddhi and others
మనోజ్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా సిద్ధుగాడి లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారిచెరుకూరు శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో, నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "సిద్ధుగాడి లవ్ స్టోరీ" సినిమా ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర విశేషాలను తెలియజేశారు.
 
 
డైరెక్టర్ రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ - నాకు సినిమాలంటే ప్యాషన్. అదే ఇష్టంతో ఈ సినిమాను రూపొందించాను. యూత్ కు బాగా నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఇష్టపడతారు.  మీరంతా తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను. అన్నారు.
 
హీరో మనోజ్ మాట్లాడుతూ - "సిద్ధుగాడి లవ్ స్టోరీ" ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని అంశాలు ఈ కథలో ఉన్నాయి. బీటెక్ చదివి సిటీలో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని వెళ్లే యూత్ అందరూ ఈ సినిమాకు  బాగా కనెక్ట్ అవుతారు. నేను నా పర్సనల్ లైఫ్ లో అలాగే హైదరాబాద్ వచ్చాను. నగరానికి చేరుకున్న తర్వాత ఆ యువత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది మా మూవీలో చూపిస్తున్నాం. నేను ఈ సినిమాలో సిద్ధు క్యారెక్టర్ చేశాను. సాంగ్స్ అదిరిపోయాయి అంటున్నారు. మీకు బాగా కనెక్ట్ అయ్యేలా మూవీ ఉంటుంది. అన్నారు.
 
హీరోయిన్ శృతి మాట్లాడుతూ - ఈ సినిమాలో అల్లరి అమ్మాయిగా కనిపిస్తాయి. కథ ప్రారంభంలో బబ్లీగా ఉండే ఆ తర్వాత నేను హీరో కోసం మారిపోతాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మంచి చిత్రమిది. మీ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వైవి రావు మాట్లాడుతూ - యూత్ కు నచ్చే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అలాంటి కంటెంట్ తో వస్తున్న మా సిద్ధుగాడి లవ్ స్టోరీ కూడ మీ అదరణ పొందుతుంది. అన్నారు.
 
రైటర్ శ్రీధర్ మాట్లాడుతూ - లైఫ్ ను ఎంజాయ్ చేసేందుకు చాలా మంది యూత్ నగరాలకు వెళ్తుంటారు. అలా వెళ్లాక వాళ్లు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మా మూవీలో ఇంట్రెస్టింగ్ గా, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూపిస్తున్నాం. యూత్ అందరికీ మా సినిమా బాగా నచ్చుతుంది. అన్నారు.
 
నటీనటులు: మనోజ్, శృతి, మోహన సిద్ధి, సుమన్, సర్కార్, చిత్రం శ్రీను , జబర్దస్త్ అప్పారావు, తదితరులు
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
వెంకటలక్ష్మితో యాడాది కిందట సినిమాను అభినందించిన హీరో తిరువీర్‌