1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Anaya Bangar Starts Cricket Practice With YograjSingh, Earns Praise

క్రికెట్ మైదానంలోకి అనయ బంగర్ ఎంట్రీ... యోగరాజ్ సింగ్ వద్ద శిక్షణ

cricket
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా ప్రముఖ క్రికెట్ కోచ్, మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ వద్ద ఆమె ప్రత్యేక శిక్షణ ప్రారంభించింది. యోగరాజ్ సింగ్ పర్యవేక్షణలో నెట్‌‍లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
 
నెట్స్ ప్రాక్టీస్‌ సెషన్‌లో అనయ బ్యాటింగ్ శైలిపై యోగరాజ్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఆమె 'బ్యాట్ ఫ్లో చాలా బాగుందని ప్రశంసిస్తూ, ఆటలో మరిన్ని మెలకువలు నేర్చుకోవాలని ప్రోత్సహించాడు. గతంలో యువరాజ్ సింగ్ సహా ఎందరో ప్రతిభావంతులైన ఆటగాళ్లను తీర్చిదిద్దిన యోగా రాజ్ సింగ్ వద్ద శిక్షణ తీసుకోవడం తన ఆటకు ఎంతో మేలు చేస్తుందని అనయ పేర్కొంది.
 
లింగ మార్పిడి చేసుకున్న క్రీడాకారులకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) రూపొందించిన నూతన నిబంధనల ప్రకారం.. ఉన్నత స్థాయి (ఎలైట్) క్రికెట్ ఆడేందుకు అనయ బంగరు ఇప్పటికే అధికారిక అనుమతి లభించింది. ఈ పరిణామంతో ఆమె మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్‌పై దృష్టి సారించింది. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా తరహాలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా మహిళల క్రికెట్లో ట్రాన్స్ జెండర్ క్రీడాకారులకు అవకాశాలు కల్పించేలా మార్గదర్శకాలు రూపొందిస్తే ఎంతో బాగుంటుందని అనయ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
కాగా, గతంలో పురుషుడిగా ఉన్నప్పుడు అనయ బంగర్ భారత దేశవాళీ క్రికెట్ ఆడడం తెలిసిందే. ఆ తర్వాత ఎంతో కఠినమైన లింగమార్పిడి చికిత్సతో మహిళగా మారింది. లింగ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత తాను ఎదుర్కొన్న సామాజిక సవాళ్లు, ఆన్‌లైన్న్ ట్రోలింగ్‌పై కూడా ఆమె గతంలో మాట్లాడింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అభిమానులు నేను తప్పు అని నిరూపించారు : ధోనీ ఎమోషనల్ వీడియో