జావా యెజ్డీ, బిఎస్ఎ మోటార్ సైకిల్స్: భారతదేశపు ఆధునిక క్లాసిక్స్ పునరాగమనం
జావా, యెజ్డీ, BSA వంటివి ప్రేరేపిస్తున్న గుర్తింపును, భావోద్వేగ సంబంధాన్ని కొన్ని మోటార్ సైకిల్స్ పేర్లు మాత్రమే కలిగి ఉంటాయి. క్లాసిక్ లెజెండ్స్ ద్వారా ఒక కొత్త తరం కోసం పునరుద్ధరించబడిన, ఈ మూడు దిగ్గజపు బ్రాండ్స్ ఈరోజు డిజైన్, లక్షణం, పనితీరు, రైడర్ వ్యక్తిత్వంపై విలక్షణమైన ఆధునిక క్లాసిక్ మోటార్ సైకిల్ వ్యాపారాన్ని నేడు రూపొందిస్తున్నాయి.
ఏప్రిల్ 2025, మార్చి 2026 మధ్యలో, జావా యెజ్డీ మరియు BSA మోటార్ సైకిల్స్ భారతదేశంలో గత ఏడాది కంటే సుమారు 40% వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ సేల్స్ సహా, వ్యాపారం 55% వృద్ధి చెందింది. విస్తరిస్తున్న అంతర్జాతీయ ఉనికితో, కంపెనీ ఇప్పుడు తన తదుపరి వృద్ధి దశ కోసం తయారవుతోంది.
జావా, యెజ్డీ, BSA వెనక ఉన్న మహీంద్ర గ్రూప్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ ఈ మూడు దిగ్గజపు బ్రాండ్స్ ద్వారా ఆధునిక క్లాసిక్ మోటార్ సైకిల్ విభాగంలో విలక్షణమైన ఉనికిని స్థాపించింది. ఆరంభపు-స్థాయి కమ్యూటర్ మోటార్ సైకిల్స్ తో పోల్చినప్పుడు దీని డిజైన్ ఆధారిత ఉత్పత్తులు, విలక్షణమైన లక్షణం, పనితీరు సామర్థ్యాల పట్ల యువ వినియోగదారులు ఈ మధ్యస్థ-సామర్థ్యం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
డెభ్బైవ దశకాలలో, జావా మరియు యెజ్డీలు భారతదేశపు యువత ఊహను ఆకట్టుకున్నాయి, వ్యక్తిత్వం, స్వేచ్ఛ మరియు మోటార్ సైక్లింగ్ సంస్కృతికి చిహ్నాలుగా మారాయి. అయితే, మార్కెట్ ఎనభైవ మరియు తొంభైవ దశకంలో గణనీయంగా మారింది, భారతీయ రైడర్స్ యొక్క తరతరాల్లో శక్తివంతమైన జ్ఞాపకాలను ప్రేరేపించడాన్ని కొనసాగించిన బ్రాండ్స్ కోసం కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయి.
అసలు బ్రాండ్స్‌తో సవాళ్లు
తొంభై దశకంలో, జపనీస్ తయారీదారులు స్థానిక భాగస్వామ్యాలు ద్వారా భారతదేశంలో విస్తరించిన కారణంగా పోటీ తీవ్రతరమైంది. వారి తేలికైన మరియు మరింత ఇంధన సామర్థ్యం గల మోటార్ సైకిల్స్ వినియోగదారు అంచనాలను మరియు విశాలమైన ద్వి-చక్ర వాహనాల మార్కెట్ ను పునః తీర్చిదిద్దడం ప్రారంభించాయి.
పునరుద్ధరణ: అనూహ్యమైన ప్రతిస్పందన నుండి పునఃనిర్మాణం సవాలు వరకు
సహ-స్థాపకులు అనుపమ్ థరేజ మరియు బొమన్ రుస్తమ్ ఇరానీల ఆధ్వర్యంలో క్లాసిక్ లెజెండ్స్ మహింద్ర గ్రూపు నుండి పెట్టుబడిని ప్రారంభించినప్పుడు, 2018లో పునరుద్ధరణ ప్రారంభమై జావాను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చింది. అనూహ్యమైన ప్రతిస్పందన లభించింది. కేవలం ఒక్క రోజులోనే జావా 1,00,000 బుక్కింగ్స్ ను అందుకుంది, కాగా ఆన్ లైన్ లో పెరిగిన ట్రాఫిక్ తో కంపెనీ వారి వెబ్ సైట్ నిలిచిపోవడానికి దారితీసింది. క్లాసిక్ లెజెండ్స్ వేగంగా తమ డీలర్ షిప్ నెట్ వర్క్ ను నిర్మించుకోవడం మరియు డిమాండ్ ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచడం ద్వారా స్పందించింది.
జావా తనదైన భావోద్వేగమైన ఆకర్షణను ఏ మాత్రం కోల్పోలేదని ప్రారంభపు ఉత్సాహం చూపించింది. భారతదేశంలో తర తరాలు ఇప్పటికీ బ్రాండ్ ని గుర్తు పెట్టుకున్నాయి మరియు కొత్త తరం దీని అనుభవం కోసం ఆసక్తిగా ఉన్నాయి. ఆ మధురానుభూతిని మరియు ప్రారంభపు డిమాండ్ ను విలక్షణమైన ఉత్పత్తులు, పనితీరు ఇంజనీరింగ్, నమ్మకమైన డీలర్ షిప్ నెట్ వర్క్ మరియు అమ్మకాల తరువాత మద్దతుతో కూడిన స్థిరమైన వ్యాపారంగా మార్చడమే ముందున్న బాధ్యతగా నిలిచింది.
కోవిడ్-19 మహమ్మారి వ్యాపించినప్పుడు కంపెనీ తన కార్యకలాపాలను రూపొందిస్తోంది. పునరుద్ధరణ యొక్క ప్రారంభపు దశలో తయారీ కార్యకలాపాలు, సరఫరా గొలుసులు, డీలర్ షిప్స్ మరియు సేల్స్ కు ఇది ఆటంకం కలిగించింది. దిగ్గజపు బ్రాండ్స్ ను పునః స్థాపించడానికి పని చేసే యువ మోటార్ సైకిల్ కంపెనీ కోసం, మహమ్మారి అదనపు సవాళ్లను తెచ్చింది. ఉత్పత్తి మరియు పంపిణీలు ప్రభావానికి గురయ్యాయి, మరియు భాగాలను సంపాదించడం మరియు కస్టమర్లకు డెలివరీలు చేయడం కొనసాగించడం నిర్వహించడంలో కంపెనీ సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది.
రూపుదిద్దుకున్న వ్యాపారం: మూడు బ్రాండ్స్, విస్తరిస్తున్న పరిధి
కోవిడ్ -19 మహమ్మారి తరువాత కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన కారణంగా, క్లాసిక్ లెజెండ్స్ తమ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ పంపిణీ మరియు యాజమాన్య వ్యవస్థలను శక్తివంతం చేయడం కొనసాగించాయి. కంపెనీ వారి రిటైల్ నెట్ వర్క్ కూడా స్థిరంగా విస్తరించడం ప్రారంభమైంది. మార్చి 2019లో 77 పట్టణాల్లో 85 డీలర్ షిప్స్ నుండి, నెట్ వర్క్ భారతదేశంలో 2026 నాటికి 450 కంటే ఎక్కువ అమ్మకాలు, సర్వీస్ మరియు విడి భాగాల టచ్ పాయింట్స్ కు వృద్ధి చెందింది. కస్టమర్లకు ముఖ్యంగా టియర్ 2 మరియు టియర్ 3 మార్కెట్లలో వారికి లభ్యతను శక్తివంతం చేసింది.
2022లో, క్లాసిక్ లెజెండ్స్ యెజ్డీని తిరిగి భారతదేశపు రహదారుల పైకి తెచ్చాయి, తమ పోర్ట్ పోలియోకి మరొక విలక్షణమైన భారతదేశపు మోటార్ సైక్లింగ్ బ్రాండ్ ను చేర్చాయి. యెజ్డీ స్క్రాంబ్లర్ తో, భారతదేశపు రైడర్లకు పెద్ద ఎత్తున ఆధునిక స్క్రాంబ్లర్ రూపాన్ని పరిచయం చేసిన తొలి బ్రాండ్లలో ఒకటిగా కంపెనీ లిచింది, విస్తృతమైన వినియోగదారుల కోసం విలక్షణమైన ఫార్మాట్ ను తీసుకువచ్చింది.
క్లాసిక్ లెజెండ్స్ ఇప్పుడు బహుళ బ్రాండ్స్ మోటార్ సైకిల్ వ్యాపారాన్ని రూపొందిస్తున్నాయి, ప్రతి బ్రాండ్ తమదైన సొంత గుర్తింపు మరియు ఆకర్షణను కలిగి ఉన్నాయి. జావా శాశ్వతమైన డిజైన్, పనితనం మరియు అందుబాటులో ఉండే వ్యక్తిత్వాన్ని సమకాలీన మోటార్ సైక్లింగ్ కు తీసుకురాగా, యెజ్డీ సాహసం, అన్వేషణ మరియు రైడింగ్ సమాజాలు ద్వారా రూపుదిద్దుకున్న సవాలు స్ఫూర్తిని సూచించింది.
BSA గోల్డ్ స్టార్ 650తో భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు పోర్ట్ ఫోలియో 2024లో విస్తరించబడింది, ప్రామాణికమైన బ్రిటీషు డిజైన్, పనితనం మరియు పనితీరును కంపెనీ వారి ఆధునిక క్లాసిక్ పోర్ట్ ఫోలియోకి చేర్చింది.
2018లో జావా యొక్క పునరాగమనంతో ప్రారంభమైన అంశం మూడు-బ్రాండ్స్ మోటార్ సైకిల్ వ్యాపారంగా వివిధ సామర్థ్యాలు, రైడింగ్ ప్రాధాన్యతలు మరియు మార్కెట్లుగా వృద్ధి చెందింది. ఆర్థిక సంవత్సరం 2026లో, క్లాసిక్ లెజెండ్స్ మొదటిసారి లాభాలను ఆర్జించింది, సుస్థిరమైన బహుళ బ్రాండ్ మోటార్ సైకిల్ వ్యాపారాన్ని రూపొందించే దిశలో తమ ప్రయాణంలో ముఖ్యమైన మైలురాయిని సూచించింది.
కీలకమైన వ్యాపార ప్రధానాంశాలు
జావా యెజ్డీ మరియు BSA మోటార్ సైకిల్స్ ఆర్థిక సంవత్సరం 27లో 1వ త్రైమాసికంలో సుమారు 125% శక్తివంతమైన వృద్ధిని నమోదు చేసాయి. ఇది నిరంతరంగా వ్యాపార వేగం మరియు పెరుగుతున్న కస్టమర్ల డిమాండ్ ను సూచిస్తోంది. అంతర్జాతీయ అమ్మకాలు సహా, వ్యాపారం ఆర్థిక సంవత్సరం 2026లో 55%కి పెరిగింది.
జావా యెజ్డీ మరియు BSA మోటార్ సైకిల్స్ దేశవ్యాప్తంగా 700 టచ్ పాయింట్లకు విస్తరించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2026లో, కేవలం ఒక్క దశలోనే 20+ టచ్ పాయింట్లను కేరళలో చేర్చాయి. ఇది వీరి భారతదేశంవ్యాప్తంగా ఉన్న టచ్ పాయింట్లను 450+ తీసుకువచ్చింది, ఇది టియర్ 2 మరియు టియర్ 3 మార్కెట్లలో సంస్థ యొక్క రిటైల్ ఉనికిని, లభ్యతను మరింత శక్తివంతం చేసింది.
జావా, యెజ్డీ మరియు BSA మోటార్ సైకిల్స్ ఆఫ్టర్-సేల్స్ మద్దతును శక్తివంతం చేయడానికి మరియు అసలైన భాగాల లభ్యతను మెరుగుపరచడానికి భారతదేశంవ్యాప్తంగా తమ అథీకృత విడి-భాగాల పంపిణీ నెట్ వర్క్ ను విస్తరిస్తున్నాయి. ఈ కార్యక్రమం, ప్రాథమిక డీలర్ షిప్ నెట్ వర్క్ కు మించి వినియోగదారులకు, సర్వీస్ భాగస్వాములకు మరియు స్వతంత్ర వర్క్ షాప్ లకు అసలైన విడి భాగాలను అందుబాటులోకి తెస్తుంది, ఫలితంగా వినియోగదారులకు సర్వీస్ సామర్థ్యం మరియు సౌకర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కొత్త అభివృద్ధులు: ఆర్థిక సంవత్సరం 2027 కోసం నాలుగు కొత్త మోడల్స్ ప్రణాళిక చేయబడ్డాయి
క్లాసిక్ మోడల్స్ ఆర్థిక సంవత్సరం 2027లో నాలుగు కొత్త మోటార్ సైకిల్స్ ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఆవిష్కరణలు జావా, యెజ్డీ మరియు BSA యొక్క విలక్షమమైన గుర్తింపులపై రూపొందుతాయి కాగా భారతదేశంలో పెరుగుతున్న మధ్యస్థ-సామర్థ్యం మరియు జీవనశైలి మోటార్ సైకిల్ విభాగాల్లో కంపెనీ వారి ఉనికిని శక్తివంతం చేస్తున్నాయి.
కొత్త మోడల్స్ జావా, యెజ్డీ మరియు BSAలలో వేగాన్ని కొనసాగిస్తూ, భారతదేశంలో పెరుగుతున్న మధ్య శ్రేణి సామర్థ్యం గల మరియు జీవనశైలి మోటార్ సైకిల్ విభాగాల్లో కంపెనీ ఉనికిని ఈ కొత్త మోడల్స్ శక్తివంతం చేస్తాయని భావిస్తున్నారు.
పునరాగమనంతో లభించిన అసాధారణమైన ప్రతిస్పందనల నుండి యెజ్డీ మరియు బిఎస్ఏలను వివిధ ఉత్పత్తులు మరియు మార్కెట్లలో విస్తరించడం వరకు, క్లాసిక్ లెజెండ్స్ మూడు ప్రసిద్ధి చెందిన పేర్లను సమకాలీన మోటార్ సైకిల్ బ్రాండ్స్ గా మార్చింది. ముందున్న ప్రయాణం కేవలం వారసత్వంతో మాత్రమే కాకుండా కొత్త ఉత్పత్తులు, ఇంజనీరింగ్ విస్తరించడం మరియు వినియోగదారుల యాక్సెస్ ను విస్తరించడం మరియు భారతదేశం నుండి అంతర్జాతీయంగా సంబంధిత బ్రాండ్లను రూపొందించే లక్ష్యంతో ప్రోత్సహించబడుతుంది.

